గుండె పగిలేంతగా తండ్రిని తలుచుకొని రితేష్.. ఈ వీడియో చూస్తే కంటతడి పెట్టాల్సిందే

జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్.. మాజీ సీఎం కుమారుడన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన విలాస్‌రావు 2012 ఆగస్ట్ 4న దివంగతులయ్యారు. అయితే నేడు (మే 26) ఆయన జయంతి. ఈ సందర్భంగా రితేష్ దేశ్‌ముఖ్.. తండ్రి జ్ఞాపకాలతో తడిసి ముద్దయ్యాడు. ఈ మేరకు షేర్ చేసిన ఓ వీడియో తన ఫ్యాన్స్‌నే కాక బాలీవుడ్ మొత్తాన్ని కదిలించింది. రితేష్ టిక్ టాక్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. నేడు తన తండ్రి జయంతి కారణంగా.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. దీనిపై బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ స్పందించారు.

అనేక పదవులు..

అనేక పదవులు..

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతేకాకుండా కేంద్ర క్యాబినేట్‌లోనూ మంత్రి పదవిని చేపట్టారు. సర్పంచ్‌గా మొదలైన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నెన్నో పదవులను అలంకరించారు. నేడు ఆయన జయంతి సందర్బంగా కుమారుడు రితేష్ ఎమోషనల్ అయ్యాడు.

తండ్రి దుస్తులను పట్టుకుని..

తండ్రి దుస్తులను పట్టుకుని..

హ్యాంగర్‌కు వేలాడదీసిన తన తండ్రి దుస్తులను చూస్తూ ఉన్నాడు. ఆ డ్రెస్‌ను వేసుకుంటున్నట్టుగా చేతులు మాత్రమే లోనిక పోనిచ్చాడు. అది తన తండ్రి చేతిగా భావిస్తూ.. తన తండ్రే ఓదారుస్తున్నట్టుగా తన చేతితో తనను ఓదార్చుకున్నాడు. ఇక ఈ వీడియో ఎందరినో ఎమోషనల్‌గా టచ్ చేసింది.

మిస్ అవుతూనే ఉన్నాం..

మిస్ అవుతూనే ఉన్నాం..

హ్యాపీ బర్త్ డే పప్పా, ప్రతీ రోజూ మిస్ అవుతున్నాను.. అని రితేష్ ఈ వీడియోను షేర్ చేశాడు. అటువైపు జెనీలియాసైతం ఎమోషనల్ అయింది. సెలెబ్రేట్ చేస్తున్నాం పప్పా.. ప్రతీరోజూ ప్రతీక్షణం మిమ్మల్నిమిస్ అవుతూనే ఉన్నామని భర్త షేర్ చేసిన వీడియోకు కామెంట్ చేసింది.

కదిలిన బాలీవుడ్..

కదిలిన బాలీవుడ్..

రితేష్ షేర్ చేసిన ఈ వీడియోపై బాలీవుడ్ స్పందిస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా కామెంట్ చేస్తున్నారు. అందులో దేవీ శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. మీ తండ్రికి హ్యాపీ మ్యూజికల్ బర్త్ డే.. పైనుంచి నీపై ప్రేమను కురిపిస్తూనే ఉంటారని కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X