జెనీలియా భర్త కూడా.. మరో హీరోయిన్ వెలుగులోకి, బాలీవుడ్‌లో ప్రకంపనలు!

మీటూ ఉద్యమ సెగతో బాలీవుడ్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. లైంగిక వేధింపుల సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మీటూ ఉద్యమంతో కొందరు దర్శకులు, నటుల భవిష్యత్తు తలక్రిందులయ్యే పరిస్థితి నెలకొంది. మీటూ ఉద్యమ సెగతో స్టార్ హీరోలు అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రాలు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ హీరోలంతా మీటూ ఉద్యమానికి మద్దతుగా విచారణ జరగాలని వారి చిత్రాల్ని నిలిపివేశారు. ఆ జాబితాలోకి ప్రముఖ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కూడా చేరాడు.

బయటపడ్డ షాజిద్ భాగోతం

బయటపడ్డ షాజిద్ భాగోతం

అక్షయ్ కుమార్ ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి షాజిద్ ఖాన్ దర్శకుడు. పేరు బయట పెట్టని ఓ నటి షాజిద్ ఖాన్ పై సంచలనమైన ఆరోపణలు చేసింది సంగతి తెలిసిందే. ఆడిషన్స్ పేరుతో నగ్నంగా నిలుచోమని అడిగాడని సంచలన ఆరోపణలు చేసింది.

షూటింగ్ రద్దు చేసిన అక్షయ్

షూటింగ్ రద్దు చేసిన అక్షయ్

షాజిద్ ఖాన్ పై ఆరోణలు రావడంతో విచారణ జరిగేవరకు షూటింగ్ నిలిపివేయాలని అక్షయ్ కుమార్ నిర్మాతలని ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడితో పనిచేయడం సరైనది కాదు అని భావించిన అక్షయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మరో హీరోయిన్ వెలుగులోకి

మరో హీరోయిన్ వెలుగులోకి

షాజిద్ ఖాన్ పై ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. తాజాగా షాజిద్ పై ఆరోపణలు చేస్తూ హీరోయిన్ మందన కరిమి వెలుగులోకి వచ్చింది. సినిమా గురించి మాట్లాడడానికి ఆయన ఆఫీస్ కు వెళితే చాలా అందంగా ఉన్నావు. కానీ బట్టలు కూడా విప్పేయాలి అని అడిగాడు.

నవ్వేసి బయటకు

నవ్వేసి బయటకు

అతడి మాటలు చాలా ఇబ్బందిగా అనిపించినా.. నవ్వేసి బయటకు వచ్చేశా. మా మేనేజర్ అతను చాలా పెద్ద డైరెక్టర్ అని చెప్పాడు. కావచ్చు. కానీ ఇలాంటి నీచమైన పనులకు అతడి పవర్ ఉపయోగించకూడదు అని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మందన తెలిపింది.

జెనీలియా భర్త కూడా

జెనీలియా భర్త కూడా

షాజిద్ ఖాన్ పై వరుస ఆరోణలు వస్తుండడంతో జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ స్పందించాడు. రితేష్ దేశ్ ముఖ్ కూడా హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నాడు. చాలా మంది నటీమణులు తనకు జరిగిన అన్యాయాల్ని ధైర్యంగా ప్రస్తావిస్తున్నారు. ఇది చాలా ధైర్యంతో కూడుకున్న పని అని రితేష్ అభిప్రాయపడ్డాడు. వారు చెప్పే విషయాలని విని వారికీ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. నేను మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్నా అంటూ ట్విట్టర్ లో స్పందించాడు.

అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా

అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా

విచారణ జరిగేవరకు హౌస్ ఫుల్ 4 షూటింగ్ రద్దు చేయాలనే అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తునట్లు రితేష్ తెలిపాడు. తన నిర్ణయం కూడా అదే అని అన్నాడు. షాజిద్ ఖాన్‌తో పాటు ఈ చిత్రంలో నటిస్తున్న నానా పాటేకర్ పై కూడా తనుశ్రీ దత్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X