హీరోయిన్ ఇంట్లో దొంగల బీభత్సం.. భారీగా చోరీ, నిన్ను రే** చేస్తామంటూ గోడపై రాతలు

కోట్లాది మంది అభిమానులు దైవంగా ఆరాధించే వెండితెర వేల్పులకు దేశంలో రక్షణ లేకుండా పోతోంది. ఇన్నాళ్లు స్టార్స్ నివాసాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటాయి అనే భ్రమలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ, సైఫ్ అలీఖాన్‌‌పై హత్యాయత్నం, ఇటీవల అక్కినేని నాగార్జున నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తుల చొరబాటు వంటి ఘటనలు సెలబ్రెటీల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. దేశంలో సినీతారలకు సైతం రక్షణ లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ప్రేమలో సంగీత

బాలీవుడ్‌ను ఒకప్పుడు తన అందం, నటనతో ఒక ఊపారు సంగీత బిజ్‌లానీ. శివరామ్, ఇజ్జత్, లక్ష్మణ రేఖ, విష్ణుదేవ, ఇన్స్‌పెక్టర్ ధనుష్, యోధ తదితర చిత్రాలు ఆమె మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సినిమాల కంటే ఎఫైర్స్, ఇతర వివాదాలతోనే సంగీత వార్తల్లో నిలిచేవారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం పెళ్లి పీటల వరకు సాగి చివరికి ఆగిపోయింది. కెరీర్ పరంగా సల్మాన్ కంటే సంగీత సీనియర్. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే దేశంలో టాప్ మోడల్ కావడంతో సంగీత డేట్స్ కోసం ఎగబడేవారు. సల్మాన్ - సంగీతలు కలిసి పలు వాణిజ్య ప్రకటనల కోసం కూడా పనిచేశారు.

Robbery at Bollywood Actress Sangeeta Bijlani s Farmhouse in Pune

లాస్ట్ మినిట్‌లో సల్మాన్‌తో పెళ్లి రద్దు
సంగీతను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని సల్మాన్ ఖాన్ ఆశించారు. మంచి ముహూర్తం చూసుకుని వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించాడు. కానీ లాస్ట్ మినిట్‌లో సల్మాన్‌ ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో బీటౌన్‌లో రూమర్స్ వచ్చాయి. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ బంధానికి ఎందుకు శుభం కార్డ్ పడలేదో ఇప్పటికీ తెలియదు. తమ బ్రేకప్‌పై ఓ కార్యక్రమంలో సంగీత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొదట్లో తమ రిలేషన్ బాగానే ఉండేదని, కానీ తర్వాత కండీషన్స్ పెట్టడం.. వస్త్రధారణ గురించి కూడా విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నానని సంగీత పేర్కొన్నారు. సంగీత 1996లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకోగా.. 2019లో వీరిద్దరూ విడిపోయారు.

సంగీత బర్త్ డే పార్టీకి సల్మాన్
ఇటీవలే సంగీత బిజ్‌లాన్ తన 65వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌కు తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ సహా బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఇదిలాఉండగా.. సంగీత బిజ్‌లానీకి మహారాష్ట్రలోని పుణేలో ఓ ఫాంహౌస్ ఉంది. మావల్ ఏరియాలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో అప్పుడప్పుడు గడిపేవారు ఈ హీరోయిన్. తాజాగా ఈ ఫాంహౌస్‌లో దొంగలు పడ్డారు. దాదాపు నాలుగు నెలల తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా తలుపులు, కిటికీలు ధ్వంసం కావడంతో పాటు వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి.

ఫాంహౌస్‌లో దొంగల బీభత్సం
దొంగలు దాదాపు 50 వేల వరకు నగదు అపహరించడంతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని, కొన్నింటిని ధ్వంసం చేశారని సంగీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటి గోడలపై తనపై అత్యాచారం చేస్తామని అసభ్య పదజాలంతో రాశారని ఆమె తెలిపారు. ఆధారాలు దొరక్కకుండా సీసీటీవీ ఫుటేజ్ సైతం ధ్వంసం చేశారని సంగీత పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యం బాలేకపోవడంతో తాను ఈ ఫాంహౌస్‌కు రావడం లేదని వెల్లడించారు. సంగీత బిజ్‌లానీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పుణే పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఇది దోపిడి దొంగల పనేనా? లేక తెలిసిన వారి కుట్రా? అన్న కోణంలో విచారిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X