తెలుగు సినిమా కోసం రంగంలోకి దిగిన రోహిత్ శర్మ.. హీరోతో రహస్యంగా సుదీర్ఘ మంతనాలు.!
రోహిత్ శర్మ.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యుడిగా సత్తా చాటుతున్న ఈ స్టార్ క్రికెటర్.. కెరీర్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఎలాంటి పిచ్ మీదైనా భారీ షాట్లు ఆడగలుగుతూ హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కొద్ది రోజులుగా గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న రోహిత్.. ఖాళీ సమయాన్ని ఓ తెలుగు సినిమా కోసం కేటాయించాడు. ప్రస్తుతం అదే పనితో బిజీగా గడుపుతున్నాడు. ఇంతకీ రోహిత్ సాయం చేస్తున్నది ఏ సినిమా కోసం.? ఆ వివరాలు మీకోసం.!

ఆకట్టుకున్న నాని.. సూపర్ హిట్ కొట్టాడు
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ'. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, హీరోగా అతడికి బాగా పేరు తెచ్చిందీ సినిమా. అందుకే దీన్ని తమ తమ భాషల్లోకి రీమేక్ చేయడానికి చాలా మంది ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలు చేశారు.

దిల్ రాజు సూపర్ ప్లాన్.. అతడితో ప్రయత్నం
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ'ని బాలీవుడ్‌లోకి తీసుకు వెళ్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు. యూనివర్షల్ సబ్జెక్ట్ ఉన్న మూవీ కావడంతో దీన్ని చేయడానికి షాహీద్ కపూర్ ముందుకు వచ్చాడు. ఇటీవల ‘కబీర్ సింగ్'తో సత్తా చాటిన ఈ స్టార్ హీరో.. మరో తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.

సినిమా కోసం ఏ హీరో చేయనంతగా కష్టం
‘జెర్సీ' హిందీ రీమేక్ కోసం షాహీద్ కపూర్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. దాదాపు ఆరు నెలలుగా అతడు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటికే రంజీ లెవెల్ కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న అతడు.. నేషనల్ లెవెల్ కోచ్‌ల సహకారం కూడా తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ దగ్గర కూడా శిక్షణ తీసుకున్నాడు.

ప్రాక్టీస్‌లో ప్రమాదం.. షూటింగ్ వాయిదా
సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న షాహీద్ కపూర్‌కు కొద్ది రోజుల క్రితం ప్రమాదం జరిగింది. మొహాలీ స్టేడియంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ బౌలర్ వేసిన బంతి షాహీద్ గడ్డానికి తగలింది. దీంతో అతడి కింది పెదవి సహా గడ్డం పగిలిపోయింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాహీద్ ఆరు వారాలు విశ్రాంతి తీసుకున్నాడు.

సినిమా కోసం రంగంలోకి దిగిన రోహిత్ శర్మ
గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. తాజాగా ‘జెర్సీ' సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ తన కోచ్‌ను కలుసుకోవడంతో పాటు హీరో షాహీద్ కపూర్‌తో సుదీర్ఘంగా మంతనాలు జరిపాడు. ఇందులో భాగంగానే బ్యాటింగ్‌కు సంబంధించిన కొన్ని సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











