జూ.ఎన్టీఆర్ పాత్ర.. అతడికన్నా బాగా ఇంకెవరూ చేయలేరంట.. ఎమోషనల్ అయిన దర్శకుడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాడు. తొలి అర్థ భాగం వరకు నెగిటివ్ షేడ్స్ తో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. అవినీతిని ప్రోత్సహించే పోలీసు అధికారిగా ఎన్టీఆర్ పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని హిందీలో దర్శకుడు రోహిత్ శెట్టి సింహా పేరుతో రీమేక్ చేస్తున్నారు. సింహ చిత్రం గురించి, రణవీర్ సింగ్ గురించి రోహిత్ శెట్టి సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి

సింహా చిత్ర షూటింగ్ పూర్తయిన సందర్భంగా రోహిత్ శెట్టి తన ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ ఏడాది జులై 6న మా ప్రయాణం ప్రారంభమైంది. ఐదు నెలలపాటు కొనసాగిన మా ప్రయాణం నేటితో ముగిసింది అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. రణవీర్ సింగ్ తో నేను చేస్తున్న తొలి చిత్రం ఇదే. మా ఇద్దరి ప్రయాణం సరదాగా, మధురమైన జ్ఞాపకాలతో సాగింది అని రోహిత్ శెట్టి పేర్కొన్నాడు.

 ఇంకెవరూ చేయలేరు

ఇంకెవరూ చేయలేరు

రణవీర్ సింగ్ అద్భుతమైన నటుడు. నిజాయితీ కలిగిన వ్యక్తి అంటూ రోహిత్ శెట్టి ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ పాత్రని రణవీర్ సింగ్ కన్నా ఇంకెవరూ బాగా చేయలేరని నేను, నా టీం ముక్త కంఠంతో చెబుతున్నాం అని రోహిత్ శెట్టి తెలిపారు. రణవీర్ సింగ్ రూపంలో నాకొక తమ్ముడు దొరికాడు అని రోహిత్ పేర్కొనడం విశేషం.

మీనమ్మతో వివాహం

రణవీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం గురించి కూడా రోహిత్ శెట్టి ప్రస్తావించాడు. నా సింహా త్వరలో తనతో సమయమైనా, అందమైన మీనమ్మని వివాహం చేసుకోబోతున్నాడు అని గర్వంగా ప్రకటిస్తున్నా అంటూ రోహిత్ శెట్టి పేర్కొన్నాడు. మీనమ్మ అనేది చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో దీపికా పదుకొనె పాత్ర పేరు. ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టే దర్శకుడు.

ఎవరూ చేయలేరు అంటే

ఎవరూ చేయలేరు అంటే

టెంపర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్స్పెక్టర్ దయగా అదరగొట్టేశాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ మినహా మరెవరూ ఫిట్ కాదనే ప్రశంసలు దక్కాయి. ఇక్కడ రోహిత్ శెట్టి ఉద్దేశం బాలీవుడ్ లో ఈ పాత్ర చేయగలిగిన వ్యక్తి రణవీర్ సింగ్ అని మాత్రమే.

 సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

సింహా చిత్రంలో రణవీర్ సింగ్ సరసన సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ నటిస్తోంది. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 28 న ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X