తన కన్నా 15 ఏళ్ల చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్.. నాలుగు పదుల వయసులో ఇదేం పని?

సుస్మితా సేన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. గతంలో మిస్ యూనివర్స్‌గా ఎంపికైన ఈమె.. భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఎన్నో సినిమాలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, కొద్ది సంవత్సరాలుగా మాత్రం తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. 2015లో 'నిర్బాక్' అనే బెంగాళీ ఫిల్మ్ తర్వాత ఆమె మరోసారి నటించలేదు.

నాలుగు పదుల వయసు వచ్చినా సుస్మితా సేన్ వివాహం మాత్రం చేసుకోలేదు. బాలీవుడ్‌లో ఎంతో మందితో ప్రేమాయణం సాగించిన ఈ ముదురు భామ.. వాటిని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేదు. కానీ, పిల్లలపై మమకారంతో ఇద్దరిని దత్తత తీసుకుంది. మరోవైపు, కొద్దిరోజులుగా రొహమన్ షాల్ అనే ఈ యువ మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెపై విమర్శల వర్షం కురిసింది.

Rohman Shawl Gave Kiss to Sushmita Sen

దీనికి కారణం.. సుస్మితా డేటింగ్ చేస్తున్న మోడల్‌, ఆమె కంటే 15 ఏళ్లు చిన్నవాడు కావడమే. ఇటీవల ఈ జంట ఓ రొమాంటిక్ వర్కౌట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సుస్మితనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా ఈ వీడియోను సుస్మిత సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా కొన్ని నెలల క్రితం ఓ ఫ్యాషన్ షోలో రొహమన్ షాల్‌ను చూసిన సుస్మిత అక్కడే ప్రేమలో పడిందని సమాచారం.

ఇదిలాఉండగా, ఆమె నటన పరంగా ఫ్యాన్స్‌కు దూరమైంది కానీ, సోషల్ మీడియాలో మాత్రం కాదు. సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్‌గా ఉండే సుస్మితా సేన్.. తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశం అవుతోంది. ఈ పిక్‌లో సుస్మితను రొహమన్ కిస్ చేస్తున్నాడు. దీన్ని ఆమె సెల్ఫీ తీసి షేర్ చేసింది. దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి. నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకోకుండా ఇవేం పనులు అని నెటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X