WAR 2: వార్ 2 మూవీకి RRR ఫార్ములా.. ఎన్టీఆర్, హృతిక్ ఆస్కార్ రేంజ్‌లో!
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మరో బడా హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'వార్' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న 'వార్ 2' మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా కొద్ది రోజుల పాటు జరిపిన విషయం తెలిసిందే.
టాలీవుడ్, బాలీవుడ్ హీరోల కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వార్ 2' మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్ పార్టును మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు.

క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న 'వార్ 2' మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఎన్టీఆర్, హృతిక్ ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఇందులో RRR నాటు నాటు సాంగ్ రేంజ్‌లో ఓ మాస్ నెంబర్ పాటను పెడుతున్నారట. ఈ సాంగ్‌లో వీళ్లిద్దరూ వేసే స్టెప్పులు ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది. ఇందులో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











