స్టార్ హీరోను కొట్టినా, ఉమ్మివేసినా 10 లక్షల బహుమతి.. ఇదెక్కడి ఆఫర్ సామీ!

స్టార్ హీరోలు అంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం, ప్రేమ ఉంటుంది. ఇక అభిమానులు అయితే వారికోం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. సాధారణ ప్రేక్షకులు సైతం హీరోలను అభిమానిస్తుంటారు. కానీ ఆ గౌరవం అంతా ప్రేక్షకులు, అభిమానులకే. కొన్ని సంఘాలు మాత్రం హీరోలు చేసే ప్రతి పనిని సమర్ధించరు. ఎంత పెద్ద హీరో అయినా శిక్షించాలనుకుంటారు. అలా తాజాగా ఓ స్టార్ హీరోను శిక్షించాలనుకుంటోంది ఓ సంఘం. అందుకు రూ. 10 లక్షల నజరానా కూడా ప్రకటించింది. అసలు విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..

సెన్సేషనల్ హిట్: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లలో సీనియర్ కథానాయకుడు అక్షయ్ కుమార్ ఒకరు. ఆయన తాజాగా నటించిన సినిమా 'ఓ మై గాడ్ 2' (Oh My God 2/OMG2). 2012లో విడుదలై సెన్సేషనల్ హిట్ కొట్టిన ఓ మై గాడ్ సినిమాకు ఇది సీక్వెల్. అందులో అక్షయ్ కుమార్ కృష్ణుడిగా అలరిస్తే ఇందులో శివుడి దూతగా చేశాడు.

Akshay Kumar Over OMG 2

వివాదాలు-అంచనాలు: నిజానికి ఓ మై గాడ్ 2 సినిమాలో అక్షయ్ కుమార్ ముందుగా శివుడి పాత్ర చేశాడు. కానీ, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఆ పాత్రను తొలగించి దూతగా మార్చాలని ఆదేశించారు. అందుకు తగినట్లుగానే శివుడి దూతగా అక్షయ్ కుమార్ పాత్రను మార్చారు. ఇదే కాకుండా సినిమా పోస్టర్స్, ట్రైలర్ లతో వివాదాలు తెచ్చుకున్న ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.

Akshay Kumar Over OMG 2

తొలిరోజు రూ. 10 కోట్లు: కాంట్రవర్సీ, భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఓ మై గాడ్ 2. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఫస్ట్ డే రూ. 10 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. అయితే లైంగిక విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి దూతగా చేయడంపై దుమారం రేగింది.

Akshay Kumar Over OMG 2

అవమానించారంటూ: శివుడి భక్తులను అవమానించేలా ఓ మై గాడ్ 2 సినిమా ఉందని పలు హిందూ సంఘాలు చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు కొన్ని థియేటర్ల ముందు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి మరి నిరసన తెలియజేశారు. ఓ మై గాడ్ 2 సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

చెంపదెబ్బ కొడితే:ఇక ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే ఏకంగా అక్షయ్ కుమార్ ను కొట్టేవారికి రివార్డ్ ప్రకటించింది. అక్షయ్ కుమార్ ను చెంప దెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మివేసినా రూ. 10 లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇదెక్కడి ఆఫర్ రా నాయనా అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Akshay Kumar Over OMG 2

తెలుగులోనూ: కాగా ఓ మై గాడ్ 2 సినిమాలో అక్షయ్ కుమార్ తోపాటు టాలెంటెడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, బ్యూటిఫుల్ యామి గౌతమ్ సైతం కీలక పాత్రలు పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను వియాకాం 18 స్టూడియోస్ రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ మూవీ ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్. దీన్ని తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేష్ తో గోపాల గోపాలగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X