‘ఆదిపురుష్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: ప్రభాస్ సినిమాలో సీనియర్ హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకుని.. బాలీవుడ్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత అతడి ఖ్యాతి ఖండాంతరాలు దాటేసింది. ఈ కారణంగానే దాని తర్వాత చేసిన 'సాహో'తో పాటు భవిష్యత్ ప్రాజెక్టులన్నింటినీ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు రెబెల్ స్టార్.

ఓం రౌత్ - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'ఆదిపురుష్'. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే ఈ మూవీలో ప్రభాస్ రాముడిగానూ, సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించనున్నారు. అలాగే, బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సీతగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు హిందీ నటుడు సన్నీ సింగ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Rs 100 Crores Budget for VFX Work in Prabhass Adipurush Movie

తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా నటిస్తుందట. ఎంతో ప్రధాన్యం ఉన్న పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు ఓ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా, ఆమె సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈమె ఎంపికతో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్'కు మరింత గ్లామర్ వచ్చినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X