180 కోట్ల బడ్జెట్.. ఎన్నికల ముందు విజయేంద్ర ప్రసాద్ పెన్ను సత్తా, హాట్ టాపిక్ గా మారిన చిత్రం!

రాజకీయాలపై వచ్చే ప్రతి చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. దేశరాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సమయంలో మరో రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు రూపుదిద్దుకునేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లోనే అనే విషయం అందరికి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని, సాధించిన విజయాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు మించిన బలమైన మాధ్యమం మరొకటి లేదు. ఆర్ఎస్ఎస్ సిద్దంతాలు, చరిత్ర, సాధించిన విజయాల్ని సినిమాగా మలచబోతున్నారు. ఈ చిత్రాన్ని 180 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించేందుకు ఆర్ ఎస్ ఎస్ నేతలు పూనుకున్నారు. ఇందులో బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ భాగమవుతుండడం విశేషం.

ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యవేక్షణలో

ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యవేక్షణలో

ఈ చిత్రం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యవేక్షణలో రూపొందనునట్లు తెలుస్తోంది. ఆయన నిర్ణయం మేరకే కథ రూపుదిద్దికోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి రచయిత

బాహుబలి రచయిత

బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, మరియు కీలక గురుమూర్తి అందించే సలహాల మేరకు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ప్రారంభం

త్వరలోనే ప్రారంభం

బాహుబలి 2 చిత్రం విడువులైన వెంటనే ఈ చిత్రానికి సంబందించిన పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు. లహరి సంస్థ అధినేత తులసి నాయుడు బిజెపి నేతలకు సన్నిహితుడు. ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయాలని ఆలోచన ఆయనదే.

 బాహుబలి విడుదలైన వెంటనే

బాహుబలి విడుదలైన వెంటనే

బాహుబలి 2 చిత్రం తరువాత తాను చెన్నై నుంచి బెంగుళూరు ప్రయాణిస్తుండగా ఈ ఆలోచన వచ్చినట్లు తులసి నాయుడు తెలిపారు. వెంటనే తన మేనేజర్ కు తెలిపి రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించానని అన్నారు. ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ భాగ్వా ద్వాజ్ అనే టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. ఆ తరువాత తాను, విజయేంద్ర ప్రసాద్ కలసి మోహన్ భగవత్ ని కలసి ఈ చిత్రం గురించి చర్చించాం అని అన్నారు.

దర్శకుడి కోసం ఎదురుచూపులు

దర్శకుడి కోసం ఎదురుచూపులు

ప్రస్తుతం తులసి నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించగల సరైన దర్శకుడి ఎదురుచూస్తున్నారు. రెండు నెలల క్రితమే విజయేంద్ర ప్రసాద్ కథ పూర్తి చేసి మోహన్ భగవత్ కి వినిపించారని ఆయన చాలా సంతోషపడ్డారని అన్నారు.

పరిశీలనలో స్టార్ హీరోల పేర్లు

పరిశీలనలో స్టార్ హీరోల పేర్లు

ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోందని తులసి నాయుడు అన్నారు. పలువురు స్టార్ హీరోల పేర్లు పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X