అనుష్క శర్మ సంచలన నిర్ణయం.... భర్త కోహ్లి కోసం సినిమాలు వదిలేస్తుందా?
బాలీవుడ్ నటి అనుష్క శర్మ చివరగా గతేడాది విడుదలైన 'జీరో' చిత్రంలో షారుక్ ఖాన్, కత్రికా కైఫ్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అనుష్క శర్మ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె తన భర్త విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ సీజన్లో సందడి చేస్తోంది. అనుష్క సినిమాలకు సైన్ చేయక పోవడం, ఎక్కువగా తన భర్తతోనే గడుపుతుండటంతో కొత్త రూమర్లకు తెరలేచినట్లయింది. ఆమె సినిమాలను వదిలేసే ఆలోచనలో ఉందని.. ఇకపై తన భర్తకు సపోర్టుగా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేయాలని నిర్ణచించుకుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

యాక్టింగ్ కంటే దాని మీదే ఎక్కువ ఫోకస్
అనుష్క శర్మ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' పేరుతో సొంత బేనర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆమె నటన కంటే తన బేనర్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించేందుకే ఆసక్తి చూపుతోందని, అందుకే ఇప్పటి వరకు ఏ సినిమాకు సైన్ చేయలేదని అంటున్నారు. అయితే అనుష్క నటన వదిలేసిందనే వార్తలను ఆమె ప్రొడక్షన్ టీమ్ ఖండించింది.

ఒక్కసారి మాత్రమే వచ్చే ఛాన్స్, భర్తకు తోడుగా..
త్వరలో ఐసీసీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ 2019 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి తొలిసారిగా వరల్డ్ కప్ వన్డే టోర్నమెంటు కెప్టెన్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇలాంటి అవకాశం కోరీర్లో ఒకేఒక్కసారి దొరికే ఛాన్స్. ఈ నేపథ్యంలో ఆ సమయంలో అతడికి సపోర్టుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ప్రస్తుతం ఏ సినిమా కమిట్ కావడం లేదని అంటున్నారు.

గతంలో విమర్శలు
విరాట్, అనుష్క పెళ్లికి ముందు... ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్న సమయంలో అనుష్క క్రికెట్ స్టేడియంలో సందడి చేసిన సందర్భాలు అనేకం. అయితే కోహ్లి ఆటలో విఫలమైన సందర్బాల్లో ఆమె విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. నీ మోజులో పడి కోహ్లి సరిగా ఆడటం లేదంటూ అప్పట్లో ఆమెపై కొందరు నిందలు వేయడం సెన్సేషన్ న్యూస్ అయింది.

విరాట్-అనుష్క
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం డిసెంబర్ 2017న వైభవంగా జరిగింది. గత డిసెంబర్లో వారు తమ మొదటి పెళ్లి రోజును, నూతన సంవత్సర వేడుకలను సిడ్నీలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది.


Click it and Unblock the Notifications











