త్వరలో కరీనా-సైఫ్ ముద్దుల కుమారుడు తైమూర్ బాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమారుడు కావడంతో.. రెండేళ్ల వయసులోనే తైమూర్ అలీ ఖాన్ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. తైమూర్ ఎంత పాపులర్ అయ్యాడంటే అతడి లుక్‌ను పోలి ఉండే తైమూర్ బొమ్మలు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి.
ప్రేక్షకులు సైతం తైమూర్ క్యూట్ ఫోటోస్, వీడియోలు చూసేందుకు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ బుడ్డోడి ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ఫోటోగ్రాఫర్లు ఇల్లు, ఎయిర్ పోర్ట్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కాపుకాచుకుని ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత డిమాండ్ ఉన్న స్టార్ కిడ్ కావడంతో అతడిని సినిమాల్లో నటింపజేసేందుకు ఫిల్మ్ మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అలియా భట్, వరుణ్ ధావన్, జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ తదితరులను లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ త్వరలో తైమూర్‌ను తన సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారట. త్వరలో తాను తీయబోయే సినిమాలో తైమూర్‌తో ఓ పాత్ర చేయించేందుకు కరణ్ జోహార్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నారని, ఇందులో తైమూర్ తండ్రిగా షారుక్ ఖాన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కరణ్ జోహార్ మూవీతో తైమూర్ ఎంట్రీ ఇవ్వడం లేదని... కరీనా కపూర్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న 'గుడ్ న్యూస్' అనే చిత్రం ద్వారా తైమూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











