ఆ సినిమా ఓ టార్చర్.. టాప్ యాక్టర్ డైరెక్టర్‌పై సినీ క్రిటిక్ ధ్వజం
ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం Runaway 34 మూవీ ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, బోమన్ ఇరానీ, అంఘీరా ధార్, ఆకాంక్ష సింగ్, క్యారీ మినాటి తదితరులు నటించారు. ఈ సినిమాకు అజయ్ దేవగన్ దర్శకత్వం వహించడం తెలిసిందే. ఫ్లయిట్‌లో సాంకేతిక లోపం చోటుచేసుకొన్న సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) తీవ్రంగా ధ్వజమెత్తాడు. Runaway 34 చిత్రం ఓ టార్చర్ నరకం అంటూ ఆయన వరసు ట్వీట్లు చేసి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.
Runaway 34 మూవీపై తన రివ్యూను ట్విట్టర్‌లో పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. Runaway 34 చిత్రం టాప్ క్లాస్ టార్చర్. ఈ సినిమాను రెండు సీన్లతోనే ఫినిష్ చేశారు. ఫస్టాఫ్‌లో ఫ్లయిట్ కాక్‌పిట్. సెకండాఫ్‌లో కోర్టు ఎపిసోడ్‌తో సినిమాను ముగించేశారు. సినిమాలో మ్యూజిక్‌కు ప్రాధాన్యం లేదు. ఓ యాక్షన్ సీన్ లేదు. వినోదం లేదు. ఈ సినిమా తీయడం డబ్బును నీళ్లలో పోయడమే కాదు, సమయం, ఎనర్జీని వృధా చేయడం అని ఘాటుగా విమర్శించారు. ఇది పాన్ మాసాలా డైరెక్టర్ అజయ్ దేవగన్ నుంచి వచ్చిన నాసిరకంగా సినిమా అని ధ్వజమెత్తాడు.

ఇక Runaway 34 చిత్రంలో ఎక్కువగా కోర్టులో డ్రామా నడిపించడం దారుణంగా ఉంది. ఈ సినిమా సెకండాఫ్‌లోనే అసలు నరకం కనిపిస్తుంది. ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ఈ సినిమా బ్రిటీష్ వారి కోసం తీశారా అని కేఆర్కే ప్రశ్నించాడు.

అయితే Runaway 34 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆదరణ కనిపించడం లేదు. ఈ సినిమా గతవారం రిలీజైన జెర్సీ కంటే తక్కువగా కలెక్షన్లు రాబట్టడం ఖాయం అని జోస్యం చెప్పారు. జెర్సీ సినిమా 2.5 కోట్లు రాబడితే.. తొలి రోజు అంతకంటే తక్కువ కలెక్షన్లు వస్తాయని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











