ఇండియన్ అంటే అనుమానం.. సాహో నటుడికి ఘోర అవమానం!
మామూలుగా మన ఇండియన్ సినిమా దగ్గర చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా హాలీవుడ్ హీరోల్లా ఉన్నార్రా అనిపించేలా చేస్తారు. మరి అలాంటి కొద్ది మంది హీరోస్ లో మన తెలుగు నుంచి కూడా కొంతమంది ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇపుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు వీరికి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ప్రశంసలు ఆడియెన్స్ నుంచి వచ్చాయి.
కాగా కేవలం హీరోస్ లోనే కాకుండా మంచి ఫిజిక్ అండ్ ఫిట్నెస్ ఇంకా హాలీవుడ్ నటుల్లాంటి కటౌట్ ఉన్న ఇతర ముఖ్య నటులు, విలన్ రోల్స్ చేసేవారు కూడా కొందరు కనిపిస్తారు. మరి అలాంటి ఓ నటుడికి చేదు అనుభవం అనుకునే కన్నా కొంచెం ప్రైడ్ గానే ఫీలయ్యే ఘటనే ,ఎదురైనట్టుగా తెలుస్తుంది.

కాగా ఆ నటుడ మరెవరో కూడా కాదు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో సినిమాలో కీలక పోషించిన ఇండియన్ నటుడు నీల్ నితిన్ ముఖేష్. కాగా ఈ నటుణ్ని చూస్తే డెఫినెట్ గా మొదటిసారి హాలీవుడ్ నటుడే అనుకుంటారు. ఆ రేంజ్ తన లుక్స్ కనిపిస్తాయి. మరి ఇవే తనకి షాకిచ్చాయట. కాగా తాను ఈ మధ్య న్యూయార్క్ దేశానికి వెళ్లాల్సి రాగ అక్కడ ఎయిర్పోర్ట్ అతన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆపేసారట. అతను భారతీయుడు అంటే ఎవరూ అక్కడ నమ్మడం లేదట.
చూసేందుకు ఇండియన్ లా లేడని అతనితో వాగ్వాదానికి దిగగా లేదు నేను భాతీయున్నే అని నమ్మించడానికి నీల్ నితిన్ ముఖేష్ ముప్పు పడ్డాడట. కానీ ఫైనల్ గా తన కోసం అంతా డౌట్ ఉంటే గూగుల్ లో వెతుక్కోండి అని చెప్పేశాడట. దీనితో వాళ్ళు అతని కోసం వెతికి చూడగా అప్పుడు ఇతడు వెస్ట్రన్ దేశస్తుడు కాదు భారతీయుడే అని నమ్మి అప్పుడు విడిచిపెట్టినట్టుగా తెలిసింది.

ఇలా తన హ్యాండ్సమ్ లుక్స్ ఈ నటుడికి కొంచెం ఇబ్బంది కలిగించాయని చెప్పాలి. ఇక ఈ టాలెంటెడ్ నటుడు తెలుగులో సాహో సినిమా తర్వాత మళ్ళీ పెద్దగా కనిపించింది లేదు. కానీ ప్రభాస్ తో ఆ సినిమాలో మాత్రం మంచి పాత్రనే దక్కించుకున్నాడు.
అలాగే ఈ సినిమాకి ముందు తమిళ్ లో విజయ్ దళపతి ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వేసిన 'కత్తి' సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమా ద్వారా తెలుగులో మొదట బెల్లంకొండ శ్రీనివాస్ కవచం ఆ తర్వాత సాహో లో అవకాశం వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇక కత్తి సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











