Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సీక్రెట్‌గా ‘సాహో’ బ్యూటీ వివాహం: పెళ్లైన వెంటనే భర్త గురించి అలాంటి వ్యాఖ్యలతో షాకిచ్చిన నటి
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీల్లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది సినీ ప్రముఖులు వివాహాలు చేసుకుంటున్నారు. ఎక్కువగా ఇది బాలీవుడ్‌లోనే కనిపిస్తోంది. ఇప్పటికే ఇటీవలి కాలంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ కూడా వివాహ బంధంతో ఒక్కటైంది. ఆమె ఎవరో కాదు.. తన అందచందాలతో సినీ లోకాన్ని మొత్తం తన వైపునకు తిప్పుకున్న ఎవిలిన్ శర్మ. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ వెంటనే భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అ సంగతులేంటో చూద్దాం పదండి!

ఇండో - జర్మన్ మోడల్‌గా గుర్తింపు
చాలా కాలంగా ఇండియాలో పాపులర్ అవుతోన్న వారిలో ఎవిలిన్ శర్మ ఒకరు. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లిది జర్మనీ. అందుకే రెండు దేశాల సంస్కృతులతో ఆమె ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే జర్మనీలోనే విద్యాభ్యాసం పూర్తి చేయడంతో పాటు అక్కడే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా ఆరంభంలోనే అక్కడ.. ఆ తర్వాత ఇక్కడ మోడల్‌గా ఫేమస్ అయిపోయింది.

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి రాక
మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఎలివిన్ శర్మ 'టర్న్ లెఫ్ట్' అనే ఇంగ్లీష్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో విడుదలైన ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇది వచ్చిన ఆరేళ్ల తర్వాత అంటే 2012లో 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపె తెచ్చుకుంది.

‘సాహో'తో టాలీవుడ్‌లోకి పరిచయం
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఎలివిన్ శర్మ.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'లో కీలక పాత్రను పోషించింది. తద్వారా టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఇక, ఈ సినిమా చేస్తోన్న సమయంలో ఈ అమ్మడు హైదరాబాద్‌లో హల్‌చల్ చేసింది. అలాగే, ప్రభాస్ అంటే ఇష్టమని చెబుతూ అతడితో ఓ ఫొటోను కూడా దిగింది. అప్పట్లో ఇది హైలైట్ అయింది.

అతడితో ప్రేమాయణం... నిశ్చితార్థం
'సాహో' సినిమా తర్వాత మరో బాలీవుడ్ మూవీలో ఐటెం సాంగ్ చేసింది ఎలివిన్ శర్మ. దీని తర్వాత ఆమె తన ప్రియుడు తుషాన్ భిండీతో నిశ్చితార్థం చేసుకుంది. వాస్తవానికి వీళ్లిద్దరూ అంతకు ముందు నుంచే డేటింగ్ చేస్తున్నారు. కానీ, 2019లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇక, దీని తర్వాత ఎలివిన్ శర్మ సినిమాలకు దూరం అయిపోయింది. కానీ, ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

అప్పటి నుంచి మ్యారేజ్‌కు ఆటంకాలు
బాలీవుడ్ హీరోయిన్ ఎవిలిన్ శర్మ - డెంటిస్ట్ తుషాన్ భిండీ నిశ్చితార్థం జరిగి దాదాపుగా రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ వీళ్లిద్దరూ చాలా కాలం పాటు వివాహం మాత్రం చేసుకోలేదు. దీనికి కారణం వీళ్ల పెళ్లికి పలుమార్లు ఆటంకం ఏర్పడడమే. వీళ్ల పెళ్లి ఆలస్యం అవుతుండడంతో ఈ జంట విడిపోయిందా అన్న అనుమానాలు కూడా బీ టౌన్‌లో వ్యక్తమైన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన భామ
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఎవిలిన్ శర్మ తన ప్రియుడు తుషాన్ భిండీని వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో నిరాడంబరంగా జరిగిన వేడుకలో ఈ జంట ఒక్కటైంది. ఈ విషయాన్ని ఎవిలిన్ శర్మ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి 'ఎప్పటికీ' అనే క్యాప్షన్ పెట్టడంతో పాటు లవ్ గుర్తుతో కూడిని ఎమోజీని జత చేసింది.

భర్త గురించి అలాంటి వ్యాఖ్యలతో షాక్
వివాహం తర్వాత ఎవిలిన్ శర్మ ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా 'తుషాన్ ఎంతో శక్తివంతుడు. నన్ను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి. అంతకంటే ముందే అతడు నాకు అభిమాని. నన్ను అభిమానించే వ్యక్తే నాకు భర్తగా దొరికాడు. ఇప్పుడు నాకోసం ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా' అంటూ తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.