Sachin Tendulkar ఈ సినిమా తప్పక చూడండి.. మిస్ చేసుకొంటే ఆ తప్పు చేసినట్టే.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్

బాలీవుడ్‌లో యువ హీరో వికీ కౌశల్ నటించిన సామ్ బహద్దూర్ చిత్రం అందరి ప్రశంసలు అందుకొంటున్నది. ఇండియాలో తొలి ఫీల్డ్ మార్షల్, లెజెండరీ ఆర్మీ జనరల్ సామ్ హెచ్ఎఫ్ మాణిక్ షా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో మాణిక్ షా భార్యగా సాన్య మల్హోత్రా, ఇందిరా గాంధీ పాత్రలో ఫాతిమా సనా షేక్, జవహర్ లాల్ నెహ్రూగా నీరజ్ కాబీ, లార్డ్ మౌంట్ బ్యాటెన్‌టా ఎడ్వార్డ్ సానెన్ బ్లిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా గోవింద్ నామ్‌దేవ్ నటించారు. ఈ సినిమా గురించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రివ్యూను ఇస్తూ..

ఆర్మీ స్టోరీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చిత్రాల్లో వికీ కౌశల్ తనకంటూ ఓ ముద్రను వేసుకొన్నారు. దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాల్లో నటించిన ఆయనకు మంచి ఫాలో ఉంది. తాజాగా ఆర్మీ జనరల్ మాణిక్ షా పాత్రలో ఒదిగిపోయాడనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

Sachin Tendulkar Review on Vicky Kaushals Sam Bahadur: Master Blaster says Must Watch movie

అయితే ముంబైలో ఇటీవల సామ్ బహద్దూర్ చిత్రాన్ని సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌కు సచిన్ టెండూల్కర్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాను చూడటానికి వచ్చిన ప్రముఖులను వికీ కౌశల్, నిర్మాత దర్శకులు సాదరంగా ఆహ్వానించారు.

సామ్ బహద్దూర్ సినిమా చూసిన తర్వాత సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ అయ్యాడు. వికీ కౌశల్‌ను కౌగిలించుకొని భావోద్వేగానికి గురి అయ్యాడు. అనంతరం మీడియాకు, ఫోటోగ్రాఫర్లకు ఫోజిచ్చాడు. సామ్ బహద్దూర్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని సచిన్ సూచించారు.

Sachin Tendulkar Review on Vicky Kaushals Sam Bahadur: Master Blaster says Must Watch movie

బాలీవుడ్ మీడియాతో సచిన్ మాట్లాడుతూ.. సామ్ బహద్దూర్ సినిమా చూశాను. అద్బుతంగా ఉంది. వికీ కౌశల్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. అచ్చం మాణిక్ షా మాదిరిగా మారిపోయాడు. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. దేశ చరిత్ర తెలుసుకోవాలంటే.. ఇలాంటి సినిమాలు తప్పకుండా చూడాలి. ఒకవేళ మిస్ అయితే తప్పు చేసినట్టే అని సచిన్ టెండూల్కర్ తన రివ్యూను వెల్లడించారు.

ఇక సామ్ బహద్దూర్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 6.25 కోట్లు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 10.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమాను 65 కోట్ల రూపాయలతో రూపొందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X