సడక్ 2 ట్రైలర్‌కు ముప్పు.. యూట్యూబ్‌ నుంచి తొలగించేలా భారీ దెబ్బ..

బాలీవుడ్‌ పరిశ్రమపై అందరూ ఊహించినట్టుగా భారీ దెబ్బ మొదటిసారి పడిందనే అభిప్రాయం సినీ, ప్రేక్షక వర్గాల్లో వ్యక్తమవుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, నెపోటిజం, ఫేవరిటజం లాంటి అంశాలు సడక్ 2 సినిమా యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా చేస్తున్నాయి. తాజాగా విడుదలైన సడక్ 2 చిత్ర ట్రైలర్ ఊహించిన విధంగానే ఘోరమైన దెబ్బ పడింది. బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రైలర్‌రే డిస్‌లైక్స్ రావడం చర్చనీయాంశమైంది. సడక్ 2 ట్రైలర్‌పై జరుగుతున్న ఎదురుదాడి గురించి వివరంగా..

Recommended Video

#Sadak2dislike : Sushant దెబ్బకి సడక్ 2 మోస్ట్ డిస్‌లైక్ రికార్డు, యూట్యూబ్‌ నుంచి తొలగించేలా..!!
 టార్గెట్ మహేష్ భట్‌ అంటూ

టార్గెట్ మహేష్ భట్‌ అంటూ

జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకొన్న వార్త బయటకు వచ్చిన కొద్ది సేపట్లోనే దర్శకుడు మహేష్ భట్‌ను అనుమానిస్తూ అందరి వేళ్లు అతడివైపే గురిపెట్టాయి. రియాతో మహేష్ భట్ సంబంధాలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేశారు. సుశాంత్ మరణానికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో రియా, మహేష్ భట్ కారణమనే అనుమానాన్ని బలపడేలా చేయడంలో సోషల్ మీడియా ప్రభావవంతమైన పాత్ర పోషించింది.

సూసైడ్ గ్యాంగ్ అంటూ ముద్ర పడటంతో

సూసైడ్ గ్యాంగ్ అంటూ ముద్ర పడటంతో

ఇలాంటి సమయంలో సడక్ 2 చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. సుశాంత్ మరణంతో ఆవేశం, ఆగ్రహంతో ఉన్న ఆయన అభిమానులు, బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్ ముద్ర వేసుకొన్న వర్గాన్ని ద్వేషించే అభిమానులందరూ మూకుమ్మడిగా సడక్ 2 ట్రైలర్‌పై దాడి చేశారు. దాని ఫలితం 6 మిలియన్లకుపైగా డిస్‌లైక్స్ రావడమే.

 సడక్ 2 ట్రైలర్ మోస్ట్ డిస్‌లైక్ రికార్డు

సడక్ 2 ట్రైలర్ మోస్ట్ డిస్‌లైక్ రికార్డు

ఆగస్టు 12వ తేదీన రిలీజైన సడక్ 2 ట్రైలర్ యూట్యూబ్‌లో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. స్వీడన్‌కు చెందిన గేమర్ పీవ్‌డీపీ సాధించిన 93 శాతం డిస్‌లైక్ రికార్డులను సడక్ 2 అధిగమించింది. యూట్యూబ్‌లో సడక్ 2 ను చూసిన వీక్షకుల్లో 95 శాతం మంది ఆ వీడియోను డిస్ లైక్ చేయడం చర్చనీయాంశమైంది.

24 గంటల్లో 6.1 మిలియన్ల డిస్‌లైక్స్

24 గంటల్లో 6.1 మిలియన్ల డిస్‌లైక్స్

ఇక అంతేకాకుండా యూట్యూబ్ చరిత్రలోనే అత్యధికంగా డిస్‌లైక్స్ సాధించిన వీడియోల్లో 6వ స్థానంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు గత 24 గంటల్లోనే సడక్ 2 ట్రైలర్ రూ.6.1 మిలియన్లు అంటే 60 మందికిపైగా అయిష్ట పడ్డారనే విషయం స్పష్టమైంది. చాలా మంది నెటిజన్లు Spam or Misleading అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. ఇదే పద్దతి ఇంక ముందు కొనసాగితే సడక్ 2 వీడియోను యూట్యూబ్ తొలిగించే అవకాశం కూడా లేకపోలేదనే మాట బలంగా వినిపిస్తున్నది.

 ప్రతికూలత మధ్య సడక్ 2 రిలీజ్

ప్రతికూలత మధ్య సడక్ 2 రిలీజ్

ఇలాంటి ప్రతికూలతల మధ్య సడక్ 2 చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌పై రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఆగస్టు 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నెటిజన్లు Uninstall Disney+ Hotstar app అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతున్నది. ఇక ఆగస్టు 28వ తేదీన సడక్ 2 సినిమా రిలీజ్‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X