twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాప్‌రే డైపర్లకే కోటిన్నర!.. షాకవుతున్న నెటిజన్లు

    |

    నవాబుల కుటుంబం.. పటౌడీ పరివారం.. సైఫ్ అలీ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైమూర్.. స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న బుడతడు. తైమూర్ బొమ్మలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయంటేనే.. అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. తైమూర్ గురించి వచ్చే ఏ చిన్న వార్తైనా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది.

    కెమెరా కంటికి కనువిందే..

    కెమెరా కంటికి కనువిందే..

    తైమూర్ ఎక్కడైనా కనిపిస్తే.. కెమెరా కళ్లలన్నీ అటువైపే చూస్తాయి. అతడు చేసే సైగలు, పలికే ముద్దు ముద్దు మాటలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ స్టార్ హీరోకు ఉండేటువంటి అభిమాన గణం తైమూర్ సొంతం. అందుకే తైమూర్‌ను జాగ్రత్తగా ప్రతీ క్షణం కాపాడుకోవడానికి ఓ కేర్ టేకర్‌ను కూడా నియమించారు. తైమూర్ పుణ్యమా అంటూ ఈమె కూడా సెలెబ్రిటీగా మారిపోయింది.

    నెలసరి జీతం..

    నెలసరి జీతం..

    నిరంతరం తైమూర్‌ వెంటే ఉండే ఆమెకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నారంటూ కొంతకాలంగా బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏదైనా ప్రత్యేక సందర్భంలో అతడితో పాటే ఉండాల్సి వస్తే మరో 50 వేలు కూడా అదనంగా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

    కరీనా బ్యాగ్ వైరల్..

    కరీనా బ్యాగ్ వైరల్..

    ఆ మధ్య ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కరీనా చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ వైరల్ అయింది. హర్మిస్‌ బిర్కిన్‌ బ్యాగ్‌తో కనిపించగా.. అటుపై దాని ధర తెలిసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రఖ్యాత బ్రాండ్‌కు చెందిన ఆ హ్యాండ్‌ బ్యాగ్‌ ధర సుమారు 18,237 డాలర్లు(సుమారు రూ. 13 లక్షలు) అని తెలుస్తోంది. ఇక కరీనా దగ్గర ఇంకా ఇలాంటివి 5 బ్యాగులు ఉన్నాయట.

    Recommended Video

    Janhvi Kapoor Spotted In Mumbai's Madh Jetty & Funny Auto Ride With Media !
     తాజాగా డైపర్లు..

    తాజాగా డైపర్లు..

    ఇలా నిత్యం ఏదో ఒక న్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ ఫ్యామిలీ. ఇక ప్రస్తుతం తైమూర్ డైపర్లపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించిన ఓ విషయం తాజాగా బయటకు వచ్చింది. ఓ డైప‌ర్ కంపెనీతో వీరు కోటిన్న‌ర రూపాయ‌ల డీల్ కుదుర్చుకున్నారట. తైమూర్ కోసం ఆ కంపెనీ ప్ర‌త్యేకంగా డైప‌ర్లు తయారు చేసి ఇస్తోందని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారట.

    English summary
    Saif Ali Khan And Kareena Spends 1.5 crore For Taimur Diaper. And seeing as he is much in demand, there are reports that suggest that his cuteness has landed his star parents a Rs 1.5 crore endorsement deal with a popular diaper brand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X