twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు బల్గేరియా ప్రభుత్వం లీగల్ నోటీసులు!

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు బల్గేరియా ప్రభుత్వం నుండి లీగల్ నోటీసులు అందాయి. అడవి పందుల వేటకు సంబంధించి కేసులో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‍‌పోల్) ద్వారా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ విట్‌నెస్(సాక్షి)గా ఉన్నాడని, దీనిపై అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఇంటర్‌పోల్ కోరింది. త్వరలోనే పోలీసులు సైఫ్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉంది.

    బల్గేరియాకు చెందిన ఓ ఏజెంట్ ఎలాంటి లైసెన్స్ లేకుండా, ప్రభుత్వం నుండి సరైన అనుమతి తీసుకోకుండా అడవి పందుల వేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హంటింగ్ టెస్ట్ పాసవ్వకుండా ఇతర దేశాల పర్యాటకులు వేటలో పాల్గొనడం బల్గేరియా చట్టాల ప్రకారం నేరం. టెస్టు పాసైతేనే వారికి హంటింగ్ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ పొందిన తర్వాత అక్కడ సందర్శకులు జంతువులను వేటాడొచ్చు.

    Saif Ali Khan Gets Notice From Bulgarian Govt For Wild Boar Hunting

    బల్గేరియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న అడవి పంది వేట కేసులో సైఫ్ అలీ కాన్ సాక్షిగా ఉండటంతో.... అతడి వాంగ్మూలం తీసుకోవాల్సిందిగా ఇంటర్‌పోల్ ద్వారా ముంబై పోలీసులుకు నోటీసులు అందాయి. త్వరలోనే సైఫ్ అలీ ఖాన్‌ను కలిసి బాంద్రా పోలీసులు ఈ కేసులో అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.

    సైఫ్ అలీ ఖాన్ గతంలో కృష్ణ జింకల వేటలో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల అనంతరం ఈ కేసు నుండి నిర్దోషిగా బయట పడ్డారు. మళ్లీ వేటకు సంబంధించిన కేసులో అతడి పేరు వినిపించడం చర్చనీయాంశం అయింది.

    English summary
    Saif Ali Khan has been sent a notice by the Government of Bulgaria through the International Criminal Police Organization (Interpol) in the Wild Boar Hunting case and has asked the Mumbai police to record his statements. The Interpol states that Saif Ali Khan is a witness in the Wild Boar Hunting case back in Bulgaria. It is reported that as soon as the Mumbai police received the orders, they recorded Saif Ali Khan's statements about the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X