Devara : నార్త్ లో దేవరకు కష్టాలు? మోడీ ఫ్యాన్స్ ఆగ్రహం..
Devara: దేవర.. దేవర.. గతవారం రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా 'దేవర' మూవీ ముచ్చట్లే. విడుదలకు ముందే ఈ మూవీ ఎంతగానో హైప్ క్రియేట్ చేసింది. ఈ ఏడాదిలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో 'దేవర' కూడా ఒకటి అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నార్త్ , సౌత్ , ఓవర్సీస్ అనే లేకుండా కలెక్షన్స్ పరంగా పలు రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. నార్త్ లో మాత్రం దేవరకు కష్టాలు ఎదుర్కొనే అవకాశముందనీ, మోడీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముందనే ఓ టాక్ తెగ వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? నార్త్ లో ఎన్టీఆర్ దేవరకు ఎదురుదెబ్బ తగలబోతుంది? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ' దేవర ' మానియా కొనసాగుతోంది. ఈ మూవీని ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. తారక్ సినిమాల్లో వన్ ఆఫ్ ది భారీ బడ్జెట్ మూవీగా చెప్పవచ్చు. ఈ భారీ బడ్జెట్ మూవీకి జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో గతంలో ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది.

అంచనాలకు తగ్గట్టుగానే.. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ డూయల్ రోల్ లో చిచ్చేశారు. అలాగే యాక్షన్ సీన్స్ ను ఎలిటేట్ చేస్తూ.. ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ . ఎన్టీఆర్ ఆరేండ్ల తరువాత సోలో హీరోగా నటించడం, ఈ మాస్ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్స్టార్ యాక్టర్ నటించడం, ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ జాన్వీ కపూర్. తొలి సినిమాలోనే అందం, అభినయం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ యాకింగ్ గురించి చెప్పక్కర్లేదు. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ రూ.140 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ వరకూ అన్ని బాగానే ఉన్నా.. తాజాగా దేవర మూవీని బీజేపీ ప్రభుత్వం బ్యాన్ చేసే ఆలోచనలో ఉందని టాక్. ఇందుకు ప్రధాన కారణం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణమంట.
అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లలో ఏ నాయకులు భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకులు కానున్నారని ప్రశ్నించగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీని సమర్థవంతమైన నాయకుడిగా తాను ఎందుకు భావిస్తున్నానో వివరించారు. రాహుల్ గాంధీ లాగా నిజాయితీ, ధైర్యం ఉన్న నాయకులంటే చాలా ఇష్టమన్నారు . రాహుల్ గాంధీ చేసిన పనులు తాను ప్రభావితమయ్యాననీ, ఒకప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రజలు అగౌరవపరిచేవారు. కానీ, ఆయన కష్టపడ్డ తీరు ప్రశంసనీయమన్నారు.

గాంధీని ప్రశంసించడంతో పాటు ఆదిపురుష్ మూవీ విడుదల సమయంలో వచ్చిన అవరోధాలను కూడా హీరో సైఫ్ ప్రస్తావించారు. ఆ సినిమా విడదల సమయంలో తాను కాస్త కలవరానికి గురయ్యాననీ, ముఖ్యంగా మతం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించి కథ చెప్పడంలో జాగ్రత్త అవసరమని పేర్కొన్నాడు. ఇది ఎంత వాస్తవమైన సమస్యో నాకు తెలియదు. చాలా మందికి తమకు కావలసినది చెప్పడానికి లేదా చేయడానికి స్వేచ్ఛ లేదని నాకు తెలుసు. మనల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు స్రుష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో బీజేపీ నాయకుడు, బీజేపి ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తుంది. సైఫ్ వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపాయి. ఆయన మాటల ప్రభావం దేవర సినిమా పై పడవచ్చని, దేవరను బ్యాన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ లో ఎక్కువ రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరీ విషయంపై దేవర టీమ్ ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి. ఓ వేళ ఈ వార్త నిజమైతే దేవరకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది.


Click it and Unblock the Notifications











