‘ఆదిపురుష్’లో ఆ హీరో రోల్ హైలైట్: ప్రభాస్ పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ మూవీ ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టును ఇందులో చూపించబోతున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బీ టౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య భీకరమైన పోరును డిజైన్ చేశాడట దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో రావణుడి పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందట. రాముడి పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నాడట ఓం రౌత్. అంతేకాదు, సైఫ్ ఇందులో పొడవాటి జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నాడట. అలాగే, నుదుటిపై పొడవాటి నల్ల బొట్టును కూడా పెట్టుకుని భయంకరంగా దర్శనమివ్వబోతున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

Saif Ali Khan Role Highlight in Adipurush

'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ ముంబైలో కొంత భాగం జరగనుందట. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X