మా పడక గధుల్లోకి కూడా వచ్చేస్తారా.. ఫోటోగ్రాఫర్స్ తీరుపై సైఫ్ అలీ ఖాన్ ఆగ్రహం.. షాకింగ్ కౌంటర్!

బాలీవుడ్ లో సెలబ్రిటీలపై నిత్యం కూడా కెమెరా ఫోకస్ ఉంటుందని చెప్పాలి. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటోగ్రాఫర్స్ కెమెరాలలో బందీ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఫోటోగ్రాఫర్స్ కాస్తా శృతి మించి సెలబ్రిటీల ప్రమేయం లేకుండా కూడా వారి ప్రైవేట్ ఫోటోలని తీస్తూ ఉంటారు. వీటిపై సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రోడ్డు మీద ఫాలో అయ్యారు

రోడ్డు మీద ఫాలో అయ్యారు


కొద్ది రోజుల క్రితం అలియా భట్ తన ప్రైవేట్ ఫోటోలని తన పర్మిషన్ లేకుండా ఫోటోగ్రాఫర్ తీసారంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా ఇదే రీతిలో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైఫ్ ఆలీఖాన్ తన భార్య కరీనా కపూర్ తో కలిసి ఓ పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ వారిని రోడ్డు మీద ఫాలో అయ్యారు.

 వారి నుంచి తప్పించుకొని

వారి నుంచి తప్పించుకొని

అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఫోటోగ్రాఫర్స్ కాస్తా శృతిమించి ప్రవర్తించారు. మలైకా అరోరా తల్లి పుట్టిన రోజు వేడుకలకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఇది జరిగింది. సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ ఇంటికి వచ్చిన సమయంలో కెమెరామెన్ లు ఫ్లాష్ లు కొడుతూ ఫోటోలు కావాలని అడిగారు. అయితే ఫోటోగ్రాఫర్స్ వెంటపడటంతో వారి నుంచి తప్పించుకొని వారు ఇంట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు.

 మా బెడ్ రూముల్లోకి కూడా వచ్చేయండి

మా బెడ్ రూముల్లోకి కూడా వచ్చేయండి

అయినా కూడా కెమెరామెన్ లు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సైఫ్ ఆలీఖాన్ ఇంకెందుకు లేట్ ఓ పని చేయండి మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి అంటూ కెమెరామెన్ ల వైపు సీరియస్ గా చూస్తూ చెప్పారు. తరువాత వారు తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారుతుంది. సైఫ్ అలీ ఖాన్ కరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చాడు అని మరికొందరు సపోర్ట్ ఇచ్చారు.

ఒక లిమిట్ అంటూ ఉంటుందని..

ఒక లిమిట్ అంటూ ఉంటుందని..

ఫోటోలు తీయడానికి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుందని, శృతిమించి బిహేవ్ చేస్తే ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో కూడా సైఫ్ అలీ ఖాన్ మీడియాలో వచ్చిన ఫేక్ రూమర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం కరెక్ట్ కాదని ఓ వర్గం మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక సైఫ్ వీలైనంత వరకు పర్సనల్ లైఫ్ లో ప్రైవసీ ఉండాలి అని బలంగా కోరుకుంటాడు. ఇక మీడియా అత్యుత్సాహం చేస్తే మాత్రం ఇలా కౌంటర్ ఇస్తూనే ఉంటాడు.

ప్రభాస్ సినిమాలో..

ప్రభాస్ సినిమాలో..

ఇదిలా ఉంటే సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన మార్కెట్ ని పాన్ ఇండియా రేంజ్ కి పెంచుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ఆయన లంకేశ్ రావణ్ గా నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో విలన్ గా కూడా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X