‘ఆదిపురుష్’లో రావణుడు అలా ఉంటాడట: అదిరిపోయేలా ప్రభాస్ విలన్‌ ఎలివేషన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అనే ఒకే ఒక్క సినిమాతో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే 'ఆదిపురుష్' అనే సినిమాతో నేరుగా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

బాలీవుడ్ హిస్టారిక్ చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపకల్పనలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.

Saif Ali Khan Shocking Look in Adipurush

తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్'లో రావణుడి పాత్ర విభిన్నంగా ఉంటుందట. ఇప్పటికే ఈ రోల్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ముంబై నగర శివారులోని మధ ద్వీపంలో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో సమానంగా ఆయనను కూడా ఎలివేట్ చేయనున్నాడట దర్శకుడు. ఇందులో భాగంగానే ఈ పాత్ర కోసం ఈ సీనియర్ హీరో పొడవాటి జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నాడట. అలాగే, నుదుటిపై పొడవాటి నల్ల బొట్టును కూడా పెట్టుకుని భయంకరంగా కనిపిస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X