పబ్లిక్‌గా హీరోయిన్ బ్లౌజ్ పట్టుకుని .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన స్టార్ హీరో
ఎంతటి ఘనులైనా, ప్రపంచాన్ని గడగడలాడించే నియంతలైనా సరే భార్య కొంగు పట్టుకుని తిరగాల్సిందే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే భార్యపై ఉన్న ప్రేమ ఎంతటి వారినైనా కరిగిస్తుంది, తన కోసం సర్వస్వం త్యాగం చేసే భార్యకు ఆప్యాయతను, ప్రేము పంచే భర్తలు ఎందరో. స్టార్ హీరోలు సైతం ఇందుకు అతీతం కాదు. ఇదే విషయాన్ని నిరూపించారు సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పటౌడీ వారసుడు, రాజవంశీకుడు , బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రేమలో పడ్డ కరీనా కపూర్ ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో అక్టోబర్ 16, 2012లో సైఫ్ అలీఖాన్‌ని వివాహమాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తైమూర్ అలీఖాన్, జహంగీర్ అలీఖాన్. పెళ్లి తర్వాత భర్త , పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు కరీనా. ఇందుకోసం తన కెరీర్‌ను కూడా వదులుకుని కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కరీనా కపూర్ ఖాన్‌గా తన పేరు మార్చుకున్నప్పటికీ హిందూ మతానే అనుసరిస్తున్నారు.

అయితే ఈ జంట తన కొడుకుకు తైమూర్ అలీఖాన్ అని పేరు పెట్టడం వివాదాస్పదమైంది. తైమూర్ అనే రాజు 14వ శతాబ్థంలో భారతదేశంపై దండెత్తి ఢిల్లీని సర్వనాశనం చేసి భారతీయులను ఊచకోత కోశాడని చరిత్రకారులు చెబుతారు. అలాంటి వ్యక్తి పేరని కరీనా, సైఫ్‌లు తమ బిడ్డకు పెట్టడంపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే పలువురు ప్రముఖులు ఈ వివాదం విషయంలో ఈ జంటకు అండగా నిలిచారు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కరీనా కపూర్ గతేడాది క్రూ, సింగమ్ ఎగైన్ వంటి సినిమాలతో దుమ్మురేపారు.
సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఓ కుదుపు చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 16న ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించాడు. అతనిని గమనించిన పనివాళ్లు పట్టుకునేందుకు యత్నించారు. అరుపులు, కేకలతో నిద్రలో ఉలిక్కిపడి లేచిన సైఫ్ అలీఖాన్ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడు. అయితే వీపు భాగంతో కత్తి ముక్క దిగబడటంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో సైఫ్ అలీఖాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సైఫ్.. తిరిగి సినిమాలలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక భార్య కరీనా కపూర్ అంటే సైఫ్ అలీఖాన్‌కు ఎంతో ఇష్టం. తొలి భార్య అమృతా సింగ్‌తో విడాకుల తర్వాత తన జీవితంలోకి వచ్చిన కరీనా తనకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని సైఫ్ పలుమార్లు తెలిపారు. కరీనా కపూర్ మల్టీ టాస్కర్ అని.. ఆమెకు ఏ విషయంలోనూ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయనని ఆయన అన్నారు. కాగా సైఫ్- కరీనాల మధ్య అనుబంధం నేపథ్యంలో ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిలో భాగంగా ఓ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. అయితే కరీనా బ్లౌజ్ వెనుక ముడి ఊడిపోయినట్లు గమనించిన సైఫ్ వెంటనే గమనించి.. ఆమె వెనుకే నిలబడి ముడి వేశారు. ఆ సమయంలో సినీ ప్రముఖులు, విలేకరులు, ఫోటోగ్రాఫర్లు భారీగా గుమిగూడి ఉన్నారు. చాకచక్యంగా కరీనా కపూర్‌కు సాయం చేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు? ఎక్కడ? తీశారన్నది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











