కరీనా వాడేనా నీ ప్రపంచం.. నన్ను పట్టించుకో.. రొమాంటిక్‌ డేట్ వెళ్దాం, మ్యాజిక్ చూపిస్తా.. సైఫ్

బాలీవుడ్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ దంపతులు వృత్తిపరంగా బిజీగా ఉంటారన్నది తెలిసిందే. ఇక కుమారుడు తైమూర్ ఖాన్ పుట్టిన తర్వాత వారి మధ్య ఎడబాటు వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఓ వైపు కెరీర్ మరో వైపు కుమారుడి ఆలనా పాలన చూసుకోవడంతో ఈ స్టార్ దంపతులు మధ్య ప్రైవసీ తగ్గిపోయిందట. దాంతో తనను పట్టించుకోవడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న సైఫ్ తన భార్యకు డేట్‌కు వెళ్దామని ప్రాధేయపడటం గమనార్హం. సైఫ్ భార్యకు ఎలా మొరపెట్టుకొన్నాడో చూడండి..

 తైమూరుతో దూరం పెరిగింది

తైమూరుతో దూరం పెరిగింది

సైఫ్ ఆలీఖాన్ ఇటీవల వాట్ ఉమెన్ వాంట్స్ అనే ఓ రేడియో చాట్ షో కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనలో భావాలు వెల్లడిస్తూ తైమూరు పుట్టిన తర్వాత మా మధ్య దూరం పెరిగింది. నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. రేడియో షో కార్యక్రమాన్ని ఉపయోగించుకొని కరీనాను ఓ కోరిక కోరుదామని అనుకొంటున్నాను అని సైఫ్ అన్నారు.

తైమూరు సంరక్షణ బాధ్యతలతో

తైమూరు సంరక్షణ బాధ్యతలతో

దాంపత్య జీవితంలో పిల్లలంటే చాలా బాధ్యతలు తలపై పడుతుంటాయి. వారి సంరక్షణ బాధ్యతలు చూడటంలో తల్లుల్లు మునిగిపోతారని నాకు తెలుసు. అలాగే కరీనా పరిస్థితి కూడా అలానే తయారైంది. పిల్లాడిని చూసుకోవడంలో బిజీగా మారింది. నా కోసం టైమ్ కేటాయించడం తగ్గిపోయింది అని సైఫ్ అన్నాడు.

రొమాంటిక్ లొకేషన్‌కు డేటింగ్‌కు

రొమాంటిక్ లొకేషన్‌కు డేటింగ్‌కు

తైమూరు బాధ్యతలు చూసుకొంటూ నన్ను మరిచిపోయావు. వీలైతే తైమూరు లేకుండా రొమాంటిక్ లొకేషన్‌కు డేటింగ్‌కు వెళ్లడానికి ప్లాన్ చేయి. అప్పుడు చూడు మ్యాజిక్ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. పిల్లాడితోనే ఎంజాయ్ చేయాలనుకొంటే దానిని తప్పుపట్టను. అలా అని నాపై నీకు ప్రేమ లేదని కాదు అని సైఫ్ పేర్కొన్నాడు.

 కరీనా కపూర్ స్పందన ఎంటంటే

కరీనా కపూర్ స్పందన ఎంటంటే

రేడియో కార్యక్రమంలో సైఫ్ ఆలీ ఖాన్ చేసిన అభ్యర్థనపై కరీనా కపూర్ స్పందించింది. నాపై సైఫ్‌కు వల్లమాలిన ప్రేమ. షూటింగ్‌ల్లో పడి నన్ను మరిచిపోయాడు. షూటింగ్ క్యాన్సిల్ చేయమంటే ఒప్పుకోడు. నేను మాత్రమం తైమూరుకు దూరంగా ఉండాలా అని కరీనా నవ్వుతూ జవాబిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X