సైఫ్ కేసులో నిందితుడి నోట షాకింగ్ విషయాలు.. దయానాయక్ స్టైల్ ట్రీట్‌మెంట్.. కరీనాను కూడా వదలకుండా!
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు కేసు విచారణలో పురోగతి సాధిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వివరాలు రికార్డు చేస్తున్నారు. ఈ దాడి జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ కేసులో కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేస్తున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు టాప్ పోలీస్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పర్యవేక్షణలో ఎలా సాగుతుందనే వివరాల్లోకి వెళితే..
నిందితుడి వివరాల్లోకి వెలితే.. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి. అసలు పేరు షారీఫుల్ ఇస్లాం షెహజాద్. కానీ విజయ్ దాస్ పేరుతో థానేలోని రికీ బార్‌లో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వలస వచ్చాడు. అయితే బార్‌లో హౌజ్ కీపింగ్ చేస్తూనే చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం సైఫ్ ఖాన్ ఇంటిలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు అని జాతీయ మీడియా కథనాలను వెల్లడించింది.

సైఫ్ ఆలీ ఖాన్‌పై దాడి తర్వాత తాపీగా డ్రస్సు కూడా మార్చుకొన్నాడు. ఆ తర్వాత మొబైల్ షాపులో కొనుగోలు కూడా జరిపాడు. అక్కడి నుంచి నిందితుడు ఏకంగా థానేకు బయలుదేరాడు. అతడిని రైల్వే పోలీసులు థానేలోనే అదుపులోకి తీసుకొన్నారు అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని సుమారుగా 70 గంటల్లో అరెస్ట్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
సైఫ్ దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నేరాన్ని తానే చేశానని ఒప్పుకొన్నాడు. దాంతో అతడిని కోర్టులో హాజరుపరిచారు. దాంతో అతడికి 5 రోజుల పోలీసు కస్టడీ కోర్టు విధించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో పేర్కొన్నది. కస్టడీ విచారణలు పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. వాటిని ఆధారంగా ఈ కేసునే కాకుండా మరికొన్ని కేసుల ఆధారాలు కూడా లభించాయనే విషయం వెలుగు చూసింది.
సైఫ్ దాడి ఘటన తర్వాత ఇప్పటి వరకు 40 మంది నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. అందులో భాగంగానే కరీనా కపూర్ నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకొన్నారు. ఇంట్లో ఏం జరిగింది? భర్తపై దాడి గురించి ఎప్పుడు తెలిసింది అనే విషయాలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు.

సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన తర్వాత విచారణను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దయానాయక్ పర్యవేక్షణలో జరిగింది. క్లూస్ టీమ్ సహాయంతో ఇంటిలో సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. పోలీస్ కస్టడీలో తనదైన శైలిలో నిందితుడిని విచారిస్తూ పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఆయన తనదైన శైలిలో ఈ కేసుకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











