శ్రద్ధాకపూర్‌పై తీవ్ర అసంతృప్తి.. అందుకే ఆలస్యమట..

By Rajababu

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ రంగంలో బయోపిక్‌ల నిర్మాణం జోరందుకొన్నది. ఎంఎస్ ధోని, మేరి కోమ్, సచిన్, సంజూ, మహానటి లాంటి బయోపిక్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ బయోపిక్‌లు అందించిన ఉత్సాహంతో బాలీవుడ్, టాలీవుడ్‌లో బయోపిక్‌లు మరిన్నీ రూపొందుతున్నాయి. ప్రస్తుతం బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఆ సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తున్నారు.

2017 నుంచి శ్రద్ధాకపూర్ బాడ్మింటన్ శిక్షణ పొందుతున్నట్టు సమాచారం. అయితే శ్రద్ధా శిక్షణపై సరిగా ధ్యాస పెట్టకపోవడంతో సైనా అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలిసింది.

 Saina Nehwal is not happy with Shraddha Kapoor over biopic

శ్రద్ధాకపూర్ ఎంత త్వరగా బాడ్మింటన్ శిక్షణ పూర్తి చేస్తే అంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో సైనా ఉన్నారు. ఈ చిత్రాన్ని అమోల్ గుప్తా రూపొందిస్తున్నారు. తన బయోపిక్ గురించి ఇటీవల సైనా మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. శ్రద్ధా సరిగా దృష్టిపెట్టడం లేదు అని సైనా అన్నారు.

సైనా బయోపిక్ ఆలస్యం కావడానికి కారణం ప్రధానంగా శ్రద్ధాకపూర్ అని తెలుస్తున్నది. ఈ బయోపిక్‌ను ఒప్పుకొన్న తర్వాత శ్రద్ధా ఇతర ప్రాజెక్టులతో బిజీగా మారింది. సాహో, స్త్రీ, బట్టి గుల్ మెటర్ ఛాలూ చిత్రాల్లో నటిస్తున్నది. త్వరలోనే నితీష్ తివారీ రూపొందించే చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సరసన నటించనున్నారు. దాంతో బాడ్మింటన్ శిక్షణకు సమయం కేటాయించలేకపోతున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X