twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సమయంలో ఫోన్ చేశారు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన సైరాభాను...

    |

    దేశం గర్వించదగిన నటుడు దిలీప్ కుమార్ మరణంతో సినీ అభిమానులు, తారలు, ప్రేక్షకులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దిలీప్ కుమార్ ఇక లేరనే విషయాన్ని తెలుసుకోగానే ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఫోన్ చేసి దిలీప్ కుమార్ సతీమణి సైరాభానును, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న తనకు ఓదార్చు ఇచ్చిన మోదీకి సైరాభాను థ్యాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ ఏమిటంటే...

    అసమాన నటనా ప్రతిభతో

    అసమాన నటనా ప్రతిభతో

    దిలీప్ కుమార్ మరణించిన వెంటనే ప్రధాని మోదీ పరామర్శించారు. అలాగే ట్విట్టర్‌లో తన సంతాపాన్ని సందేశం రూపంలో వెల్లడిస్తూ.. దిలీప్ కుమార్‌ను సినిమాటిక్ లెజెండ్‌గా ఎప్పటికి గుర్తుంచుకొంటారు. అసమాన నటనా ప్రతిభతో అద్భుతమైన పాత్రలతో అన్ని తరాల ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాడు.

    సాంస్కృతికి ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటు. దిలీప్ మరణంతో విషాదంలో కూరుకుపోయిన అసంఖ్యాక అభిమానులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

    సినీ ప్రముఖుల నివాళి

    సినీ ప్రముఖుల నివాళి

    దిగ్గజ నటుడికి బాలీవుడ్ సినీ పరిశ్రమ ఘనంగా శ్రద్దాంజలి ఘటించింది. అమితాబ్, ధర్మేంద్ర, సుభాష్ ఘాయ్, విద్యాబాలన్, షారుక్ ఖాన్ తదితరుల దిలీప్ కుమార్ పార్దీవదేహాన్ని సందర్శించి చివరిచూపుగా నివాళులర్పించారు. ముంబై జుహు ప్రాంతంలో జరిగి అంత్యక్రియలకు కూడా పలువురు సినీ తారలు హాజరయ్యారు.

    ప్రధాని ట్వీట్‌కు సైరా భాను స్పందించి

    ప్రధాని ట్వీట్‌కు సైరా భాను స్పందించి

    ప్రధాని మోదీ ట్వీట్‌కు స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీజీ.. బుధవారం ఉదయమే ఫోన్ కాల్ చేశారు. నన్ను పరామర్శించి మమల్ని ఓదార్చేందకు ప్రయత్నించారు. అందుకు సర్వదా మేము రుణపడి ఉంటాం అని సైరాభాను తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ట్వీట్ చేశారు. అలాగే మంత్రి పియూష్ గోయల్ ప్రభుత్వం తరుఫున తన సంతాప సందేశంలో శ్రద్దాంజలి ఘటించారు.

    Recommended Video

    #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
    సైరా భాను మరో ట్వీట్

    సైరా భాను మరో ట్వీట్

    ప్రధాని ట్వీట్‌కు సైరాభాను రిప్లై ఇస్తూ... దిలీప్ కుమార్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించినందుకు ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు థ్యాంక్యూ.. గొప్ప నటుడికి ఉన్నతంగా వీడ్కోలు చెప్పినందుకు అభిమానుల తరఫున, కుటుంబం తరఫున ధన్యవాదాలు అంటూ సైరా భాను మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Dilip Kuamr dies at 98: Shah Rukh Khan Condolences Saira Bhanu at thier residence in Bandra West. Dilip Saheb's funeral modalities and the last rites are to be held at the Juhu Muslim Cemetery in Santacruz west, around 5 p.m. in this occassion, Modi called saira Bhanu. So Saira Bhanu Thanks to Prime Minister Narendra Modi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X