నాకు అవార్డులు అవసరం లేదు.. కానీ కత్రినాకు గ్యారంటీ.. సల్మాన్ ఖాన్
గత మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకధాటిగా ఏలేస్తున్నాడు. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. 1988లో బీవీ హో తో ఐసీ అనే సినిమాతో తెరంగ్రేట్రం చేసిన సల్మాన్ ఖాన్ అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూసుకొన్న దాఖలాలు లేవు. 30 ఏళ్లలో బాక్సాఫీస్‌ను కుదిపేసిన హిట్లను అందించాడు. అయితే కలెక్షన్ల సునామీని కురిపించినా ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా పలకరించలేదు. అదే విషయాన్ని ప్రస్తావించగా సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే..

నాకు అవార్డులు వొద్దు.. రివార్డులే
నాకు నేషనల్ అవార్డు గానీ, ఇతర అవార్డు గానీ అవసరం లేదు. నాకు కేవలం రివార్డుల మాత్రమే కావాలి. నా సినిమాలను ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూస్తే అదే నాకు నేషనల్ అవార్డు దక్కినంత ఆనందం కలుగుతుంది. నా సినిమాను దేశవ్యాప్తంగా ఆదరిస్తే అంతకంటే గొప్ప రివార్డు, అవార్డు ఏముంటుంది అని సల్మాన్ ఖాన్ అన్నారు.

అత్యంత సంతృప్తికరంగా భారత్
భారత్ మూవీ నాకే కాదు.. అభిమానులకు కూడా అత్యంత సంతృప్తిని అందించిన చిత్రంగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమాపై ప్రేమను, ప్యాషన్ కనబరిచారు. ప్రతీ ఒక్కరు హృదయాన్ని, మనసు పెట్టి చేశారు అని సల్మాన్ తెలిపారు.

తెరపై కొత్త సల్మాన్ ఖాన్
భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను కొత్తగా చూస్తారు. తెర మీద నేను ఎంత కష్టపడ్డానో ప్రతీ ఫ్రేమ్ చెప్పకనే చెబుతుంది. పలు రకాల క్యారెక్టర్లను దర్శకుడు అలీ చాలా కష్టపడి డిజైన్ చేశారు. ఆయన రూపొందించిన పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయాననే ఫీలింగ్ మాత్రం కలిగింది అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.

కత్రినాకు జాతీయ అవార్డు గ్యారెంటీ
భారత్ సినిమాలో కత్రినా కైఫ్ ఫెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గొప్ప పేరు వస్తుంది. ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు జాతీయ అవార్డు కూడా వస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమాకు కత్రినా రోల్ హైలెట్‌గా నిలుస్తుంది అని సల్మాన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











