అందరూ అలా చూస్తే రూ. 600 కోట్లు కూడా ఈజీగా వస్తాయి: సల్మాన్ ఖాన్
గత దశాబ్ద కాలంగా బాలీవుడ్ బాక్సాఫీసును మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తనకు తానే భారీ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అది ఎంతలా ఉందంటే ఆయన సినిమాకు రూ. 150 కోట్లు వచ్చినా దాన్ని హిట్ సినిమాగా భావించని పరిస్థితి.
సల్మాన్ ఖాన్ సినిమా విడుదలవుతుందంటే అంచనాలు హై రేంజిలో ఉంటాయి. మూవీ కనీసం రూ. 300 కోట్లు వసూలు చేస్తేనే దాన్ని హిట్ మూవీగా భావిస్తారు. ఇదే విషయమై సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ...'సినిమాపై మీకు(ప్రేక్షకులకు) అంచనాలు భారీగా ఉంటే మీరు థియేటర్ వెళ్లి చూడాలి. సినిమా టీవీలో వచ్చే వరకు వెయిట్ చేస్తామనో, డిజిటల్‌లో చూద్దామనో, పైరసీ కాపీ కోసమో వెయిట్ చేయొద్దు. మీరు సినిమా థియేటర్లో వెళ్లి చూస్తేనే కలెక్షన్లు వస్తాయి. అందరూ అలా సినిమా చూస్తే రూ. 340 కోట్లేమిటి... రూ. 640 కోట్లు కూడా వస్తాయి.' అని వ్యాఖ్యానించారు.
ప్రేక్షకులు నా సినిమా థియేటర్లకు వెళ్లి చూడటమే నాకు జాతీయ అవార్డుతో సమానం. దేశం మొత్తం నా సినిమా చూస్తుంది అనే విషయం కంటే పెద్ద రివార్డు ఏమీ ఉండదు అని సల్మాన్ ఖాన్ ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్. 'భారత్' చిత్రంలో నటనకు గాను కత్రినా కైఫ్ జాతీయ అవార్డు దక్కించుకునే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఇప్పటి వరకు ఆమె కెరీర్లో చేయని భిన్నమైన పాత్రలో కనిపించబోతోందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న 'భారత్' ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరియన్ మూవీ 'ఆన్ ఓడె టు మై ఫాదర్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో సల్లూ భాయ్ ఐదు డిఫరెంట్ లుక్స్‌లో ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు.


Click it and Unblock the Notifications











