ఆవిడే మా వెంట పడింది, వెయ్యి ఫోన్ కాల్స్: హీరో సంచలనం

By Bojja Kumar

సల్మాన్ ఖాన్ మూవీ 'భరత్' నుండి ప్రియాంక చోప్రా అర్దాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ను తీసుకున్నారు. ప్రియాంక చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం ద్వారా చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రచ్చ చేయడం ఇష్టం లేక సల్మాన్ ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ లైట్ తీసుకున్నారు. ఇంటీవల ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్.... ప్రియాంక వివాదంపై స్పందించారు. తాము ఆమెను కావాలనుకోలేదని, ఆమెనే అవకాశం కోసం వెంటపడిందన్నారు.

 వెయ్యి సార్లు కాల్ చేసింది

వెయ్యి సార్లు కాల్ చేసింది

‘భారత్' సినిమాలో తనకు అవకాశం ఇవ్వాలని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌ను కోరడంతో పాటు... నా చెల్లి అర్పితకు ఈ విషయమై ప్రియాంక వెయ్యి సార్లు ఫోన్ చేసిందని సల్మాన్ ఇటీవల వెల్లడించారు.

 మా వెంటపడి, ఇప్పుడేమో ఇలా

మా వెంటపడి, ఇప్పుడేమో ఇలా

సినిమా అవకాశం కోసం మా వెంటపడింది. తర్వాత పెళ్లి కారణం చెప్పి హ్యాండిచ్చింది. సినిమా నుండి తప్పుకోవడానికి కేవలం ఆమె పెళ్లి మాత్రమే కారణం అనుకోవడం లేదు. మన ఇండస్ట్రీ కంటే హాలీవుడ్ సినిమాల్లో నటించడానికే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతోంది అని సల్మాన్ వ్యాఖ్యానించారు.

ప్రియాంక పెళ్లి కోసం వెలుసుబాటు ఇచ్చాం

ప్రియాంక పెళ్లి కోసం వెలుసుబాటు ఇచ్చాం

పెళ్లి సాకు చెప్పి సినిమా నుండి తప్పకుంటాను అని చెప్పినపు ఆమెకు కాస్త వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాం. షూటింగ్ కు 75-80 రోజుల సమయం ఉంది. పెళ్లి పనుల కోసం నాలుగు రోజులు, పెళ్లికి నాలుగు రోజులు, హనీమూన్ వెళ్లడానికి తగిన విధంగా షెడ్యూల్ మార్పులు చేస్తామని కూడా చెప్పాము. అయినా ఆమె ఒప్పుకోక పోవడంతో మాకు అసలు విషయం అర్థమైంది అని సల్మాన్ అన్నారు.

హాలీవుడ్ మూవీలో ప్రియాంకు ఛాన్స్

హాలీవుడ్ మూవీలో ప్రియాంకు ఛాన్స్

సల్మాన్ ఖాన్ సినిమా నుండి తప్పుకోవడానికి కేవలం తన ఎంగేజ్మెంట్, పెళ్లి మాత్రమే అని కటింగ్స్ ఇచ్చిన ప్రియాంక చోప్రా. వాస్తవానికి ఆమె ‘భారత్' నుండి తప్పుకోవడానికి హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓ కారణం. గార్డియన్ ఆఫ్ గెలాక్సీ మూవీ స్టార్ క్రిస్ ప్రాట్‌తో కలిసి నటించే అవకాశం రావడం కూడా సల్మాన్ మూవీ నుండి తప్పుకోవడానికి అసలు కారణమని అంటున్నారు.

భారత్ మూవీ

భారత్ మూవీ

అయితే ప్రియాంక తప్పుకోవడం కూడా మన మంచికే అనుకుని సల్మాన్ అండ్ కో ‘భారత్' మూవీలో కత్రినాను తీసుకున్నారు. వచ్చే ఏడాది ఈద్ సమయానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X