ఆమె కన్యగానే ఉండిపోవాలా.. మీలో ఒకరికి ఛాన్స్ ఇస్తే.. సల్మాన్ ఖాన్ కామెంట్స్

బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతూ వస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో లవ్ అఫైర్స్ సంగతి పక్కన పెడితే 57 ఏళ్ల వయసు మీద ఉన్న ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. ఇక సినిమాలే జీవితం అన్నట్లుగా వరుసగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రమంలో ఇందులో నటించిన ఓ నటి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు సల్మాన్ ఖాన్.

కీలక పాత్రల్లో వారు:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే పఠాన్ సినిమాలో టైగర్ గా అదిరిపోయే కెమియే ఇచ్చిన సల్లూ భాయ్ త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ఏప్రిల్ 21న థియేటర్ల వద్ద సందడి చేయనున్నాడు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా చేయగా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రలు పోషించనున్నారు.

Salman Khan About Shehnaaz Gill In Kisi Ka Bhai Kisi Ki Jaan Kapil Sharma Show

ఆ జంటపై:సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీలో హిందీ బిగ్ బాస్ 13 ఫేమ్ షెహనాజ్ గిల్ కూడా నటించింది. ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా షెహనాజ్ తో కలిసి కపిల్ శర్మ కామెడీ షోలో సందడి చేశాడు సల్మాన్. ఈ క్రమంలోనే షెహనాజ్, దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా (సిద్నాజ్ SidNaaz) జంటపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సిద్నాజ్ అని ముద్దుగా:షెహనాజ్, సిద్ధార్థ్ బిగ్ బాస్ లో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమించుకున్నారు. బిగ్ బాస్ హిందీ 13 విన్నర్ గా సిద్ధార్థ్ నిలవగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశాడు. ఇక సిద్ధార్థ్, షెహనాజ్ జంటకు అభిమానులు సిద్నాజ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే సిద్ధార్థ్ శుక్లా 2021లో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సల్మాన్ ఖాన్ తాజాగా మాట్లాడాడు.

Salman Khan About Shehnaaz Gill In Kisi Ka Bhai Kisi Ki Jaan Kapil Sharma Show

ట్రెండ్ చేస్తున్నారు:"సిద్ధార్థ్ చాలా క్రితం మరణించాడు. కానీ సోషల్ మీడియా మాత్రం సిద్నాజ్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. అతను ఇప్పుడు ప్రపంచంలో లేడు. అతను ఎక్కడ ఉన్న గానీ షెహనాజ్ జీవితంలోకి మరొకరు రావాలని, తను పెళ్లి చేసుకుని, పిల్లలతో హాయిగా ఉండాలని కోరుకునేవాడు. కొందరు ఫ్యాన్స్ తరచూ SidNaaz హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు" అని సల్మాన్ ఖాన్ తెలిపాడు.

జీవితంలో ముందుకెళ్లు..:సల్మాన్ ఖాన్ ఇంకా కొనసాగిస్తూ "షెహనాజ్ జీవితాంతం సింగిల్ గా, కన్యగా ఉండాలని (SidNaaz ఫ్యాన్స్) భావిస్తున్నారా. ఒక వేళ ఆమె మీ అభిమానుల్లో ఒకరిని ఎంచుకుంటే.. వారు ఆమెతే సంతోషంగా ఉంటారు. షెహనాజ్ చెత్త మాటలు అసలు వినవద్దు. సిద్ధు చనిపోయి రెండేళ్లు అవుతుంది. అది అర్థం చేసుకుని.. జీవితంలో ముందుకెళ్లు. ఇప్పుడైనా ఇది ఇక్కడితో వదిలేయ్" అని షెహనాజ్ కు సలహా ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X