twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీటింగ్ కేసులో సల్మాన్, ఆయన సోదరి అల్వీరాకు సమన్లు.. 13న విచారణకు పిలుపు

    |

    బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్, అతడి సోదరి అల్వీరాతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చండీగఢ్ పోలీసులు వారికి సమన్లు జారీ చేశారు. వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    బాధితుడు అరుణ్ గుప్తా ఫిర్యాదు

    బాధితుడు అరుణ్ గుప్తా ఫిర్యాదు

    మీడియా కథనాల ప్రకారం.. బాధితుడు అరుణ్ గుప్తా ఫిర్యాదు ఇలా ఉంది. నేను బీయింగ్ హ్యూమన్ జ్యువెల్లరీ పేరుతో ఓ స్టోరును ప్రారంభించాను. దాని కోసం సుమారు 3 కోట్లు ఖర్చు చేశాను. అయితే ప్రమోషన్ కార్యక్రమాలు అంచనా ప్రకారం జరగలేదు. అలాగే వస్తువులు, అభరణాలు కూడా స్టోర్‌కు చేరలేదు అని అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో తెలిపారు.

    బ్రాండ్ ప్రమోషన్‌లో

    బ్రాండ్ ప్రమోషన్‌లో

    బ్రాండ్ ప్రమోషన్, వస్తువుల సరఫరా విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కారు. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్ చేస్తానని చెప్పిన సల్మాన్ ఖాన్ కూడా ఏమీ చేయలేదు అని నిర్వాహకులపై అరుణ్ గుప్తా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    సల్మాన్ ఖాన్ ముఖం చాటేశాడంటూ..

    సల్మాన్ ఖాన్ ముఖం చాటేశాడంటూ..

    దాంతో పలుమార్లు నిర్వాహకులను సంప్రదిస్తే వారు స్పందించలేదు. సల్మాన్ ఖాన్ స్టోర్ ఓపెనింగ్ వస్తానని ముఖం చాటేశారు. సల్మాన్ ఖాన్ బదులు ఆయన బావ ఆయుష్ శర్మ ఓపెనింగ్‌కు వచ్చారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    జూలై 13న విచారణకు

    జూలై 13న విచారణకు

    ఇదిలా ఉండగా, అరుణ్ గుప్తా ఫిర్యాదుతో చండీగఢ్ పోలీసులు స్పందించారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవాలను తేల్చుకోవడానికి విచారణకు హాజరుకావాలని వారు సమన్లలో పేర్కొన్నారు. జూలై 13వ తేదీన సల్మాన్, అల్వీరాతోపాటు మరో అరుగురిని, అలాగే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో, బీయింగ్ హ్యుమన్ జ్యువెల్లరీ యాజమాన్యాలను విచారణకు రమ్మని సమన్లలో పేర్కొన్నారు.

    English summary
    Salman Khan and Alvira Khan gets summons from Chandigarh Police in Cheating case. Being Human Jewellery files case on Salman Khan for not promoting the brand and not attending to inaugarte the store.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X