వైరల్ వీడియో .. ఫామ్ హౌస్‌లో సల్మాన్ రొమాన్స్ మాములుగా లేదే.. ఆ హీరోయిన్‌తో రచ్చ రచ్చే
సల్మాన్ ఖాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన పెళ్లి విషయమే. ఐదు పదుల వయసు దాటిని ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నాడు. అయితే ప్రేమ వ్యవహారాలకే ఏమైనా దూరమా? గిట్టదా? అంటే అదీ కాదు. సల్మాన్ భాయ్ నిత్య ప్రేమికుడు. ప్రేమ, హీరోయిన్లతో సాంగత్యం లేనిది అసలే ఉండలేదు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ వ్యవహారాలు అందరికీ తెలిసిందే. అయితే కత్రినా కైఫ్‌తో వ్యవహారం దాదాపు పెళ్లి పీఠల వరకు వచ్చినట్టే వచ్చింది. మళ్లీ దూరమైంది. ఆ తరువాత మళ్లీ కత్రినా దగ్గరైంది కానీ ఆ ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. సల్లూ భాయ్ ప్రస్తుతం విదేశీ భామలతో ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా కారణం లాక్ డౌన్ విధించడంలో సల్మాన్ సొంత ఫామ్ హౌస్‌లోనే చిక్కుకుపొయారు.

ఫామ్‌హౌస్‌లో సందడి..
కరోనా వైరస్ కట్టడిలో విధించిన లాక్ డౌన్‌ను సల్లూ భాయ్ తెగ ఎంజాయ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ముంబై నగరానికి దూరంగా, ప్రకతికి, ప్రశాంతతకు చాలా దగ్గర్లో ఉన్న తన పన్వేల్ ఫామ్ హౌస్‌లో జాక్వెలిన్, లూలియా వాంటూర్‌లతో ఉంటున్నాడు. అక్కడి విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు.

గుర్రంతో టైమ్ పాస్..
సల్మాన్‌కు గుర్రపు స్వారీ అంటే మహా ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన గుర్రానికి తానే దానవేస్తూ ఆ గడ్డిని కూడా తింటున్న వీడియోను సల్మాన్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ గుర్రంతో ఫామ్ హౌస్‌లోనే సల్మాన్ షికారు చేస్తున్నాడు.

పెళ్లి చేసుకోవాలా? సంతోషంగా ఉండాలా?
సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ లూలియా వాంటూర్ పెళ్లి విషయమై స్సందిస్తూ.. ఒకరితో హ్యాపిగా ఉండటం, సమయాన్ని గడపడమే నా దృష్టిలో పెళ్లి కంటే ముఖ్యమైందని చెప్పుకొచ్చింది. అంటే ఈ లెక్కన వీరిద్దరూ జీవితాంతం ఇలానే ఉండిపోతారేమో.
Recommended Video
తేరే బినా అంటూ రొమాన్స్..
కిక్, రేస్ 3 సినిమాలో సల్మాన్‌తో జంట కట్టిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఫామ్ హౌస్‌లో ఉంది. సమయాన్ని వృథా చేయడం ఎందుకని పరిమిత వనరులతోనే ఓ చక్కటి ఆల్బమ్‌ను రూపొందించారు. సల్మాన్ ఆలపించిన ఈ పాటను ఫామ్ హౌస్, చుట్టు పక్కల ప్రాంతాల్లో అద్భుతంగా చిత్రీకరించారు. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్‌లో వీరిద్దరి రొమాన్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











