Tiger 3 Trailer: "టైగర్ 3" ట్రైలర్ రిలీజ్, అదరహా అనిపిస్తున్న సల్మాన్, కత్రినా ఫైట్ సీన్లు
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ల కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం టైగర్ 3. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఎక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలకు సీక్వెల్ గా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రకటించినప్పపటి నుంచే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. ఇందుకు సంబంధించిన విషయాలు, అప్ డేట్లు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లకు ఇప్పటికే విడుదల కాగా.. అనూహ్య స్పందన వచ్చింది. అదే ఊపుతో ఈ చిత్రాన్ని నవంబర్ 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క హిందీలోనే కాకుండా తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈక్రమంలోనే ప్రమోషన్లు చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఫైట్ సీన్లు అదిరిపోయాయి.

సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. అలాగే ఆయన తన దేశాన్ని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే ఇదే సమయంలో ఉగ్రవాదులకు సాయం చేసినట్లు ప్రచారం జరగడంతో తన నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథను తీసుకొని మనీశ్ శర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్లు ఉండగా.. కత్రినా ఫైట్ సీన్లు కత్తిలా ఉన్నాయి.
అంతేకాకుండా వెల్ కమ్ టు పాకిస్థాన్ అని ఇమ్రాన్ హష్మీ చెప్పే డైలాగ్ చూస్తుంటే ఇది ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందని అర్థం అవుతోంది. కానీ స్పై యూనివర్స్ లోని ముందు సినిమాల్లోలాగా ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం గురించి మాత్రమే కాకుండా, పర్సనల్ మిషన్ అని కూడా తెలుస్తోంది. మనీశ్ శర్మ డైరెక్ట్ చేసిన టైగర్ 3 ట్రైలర్.. అందరినీ అలరిస్తోంది. ముఖ్యంగా సల్మాన్ అభిమానులు ఈ ట్రైలర్ ను చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ను ఎదుర్కునే ధీటైన విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. ఇప్పటి వరకు కేవలం రొమాంటిక్ హీరోగానే ప్రేక్షకులను అలరించిన ఇతగాడు.. తొలిసాగి విలన్ పాత్రలో మెరవబోతున్నాడు. మరి ఇమ్రాన్ హష్మీ విలన్ గా సెట్ అవుతాడా లేదో. మరి ఈ అద్భుతమైన చిత్రం ఏ రేంజ్ లో హిట్టవుతుందో, ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











