Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హౌడీ మోడీ సభపై సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ స్పందన.. ప్రధానిపై కామెంట్స్
అమెరికాలోని టెక్సాస్ నగరం హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన హౌడీ మోడీ సభ అట్టహాసంగా జరిగింది. దాదాపు 50 వేల మంది ఇండో అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ వేదిక వద్దకు రాగానే మోడీ... మోడీ అంటూ స్టేడియం నినాదాలతో దద్దరిల్లింది. అనంతరం ట్రంప్ 25 నిమిషాల పాటు మాట్లాడారు. భారత్, అమెరికా కలలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీతో కలిసి పని చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంపై బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత్, అమెరికా దేశాల తత్సంబంధాలకు పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమం మార్గం సుగమం చేసిందని సల్మాన్ ట్వీట్ పెట్టారు. ఇక అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ''ఓ అద్భుతమైన కార్యక్రమం హౌడీ మోడీ సభ. గతంలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమం చూడలేదు. ఈ సభలో 50 వేల మంది చూపిన ఎమోషన్స్ మరపురానివి. ప్రధాని మోడీ రియల్ రాక్ స్టార్. జయ హో'' అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ సభలో నరేంద్ర మోడీని ట్రంప్ ఆకాశానికెత్తాడు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని, ప్రపంచ సేవకుడు అని ట్రంప్ కొనియాడారు. భారత్‌తో పాటు ప్రపంచమంతటికీ మోడీ గొప్ప సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. భారత అత్యున్నత విలువలు, సంస్కృతి అమెరికా విలువలతో కలిసిపోతాయన్నారు. ఇరుదేశాల మధ్య గతంలో లేనంతగా సంబంధాలు బలోపేతమయ్యాయని చెప్పారు. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నామని, అమెరికాలో ఆర్థిక సమానతలు వేగంగా తగ్గుతున్నాయన్నారు.