»   » హీరోయిన్ దీనస్థితి: ఆమె నా కోస్టార్ కాదు, అయినా సాయం చేస్తానన్న సల్మాన్ ఖాన్

హీరోయిన్ దీనస్థితి: ఆమె నా కోస్టార్ కాదు, అయినా సాయం చేస్తానన్న సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'వీర్‌గాటి' సినిమాలో నటించిన హీరోయిన్ పూజా దద్వాల్ గురించి కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తీవ్రమైన టీబీ వ్యాధి సోకి వైద్యానికి కూడా డబ్బులేని దీనమైన స్థితిలో ఆమె ఉండటం అందరినీ కలిచి వేసింది. మీడియా ద్వారా ఆమె తనకు సల్మాన్ ఖాన్ సహాయం చేయాలని వేడుకోవడంతో ఈ అంశం మరింత హైలెట్ అయింది. అయితే సల్మాన్ నుండి ఎలాంటి స్పందన లేక పోవడం, రవి కిషన్ లాంటి భోజ్‌పురి యాక్టర్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

సల్మాన్ ఖాన్ ఆ హీరోయిన్ ని పట్టించుకోవట్లేదా ?
పూజా దద్వాల్ గురించి సల్మాన్‌కు ప్రశ్నలు

పూజా దద్వాల్ గురించి సల్మాన్‌కు ప్రశ్నలు

అయితే సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్' టూర్ పేరుతో పూణెలో పర్యటించిన సందర్భంగా ఆయనకు పూజా దద్వాల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ తనకు ఇప్పుడే ఈ విషయం తెలిసిందని, తప్పకుండా ఆమెకు సహాయం చేస్తానని తెలిపారు.

ఆమె నాతో జతకట్టలేదు

ఆమె నాతో జతకట్టలేదు

‘వీర్‌గాటి' చిత్రంలో పూజా నాకు జతగా నటించలేదు. ఇందులో ఆమె అతుల్ అగ్నిహోత్రికి జోడీగా నటించారు. పూజా గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. ఆమెకు సహాయం చేయడానికి మా టీం రంగంలోకి దిగింది. నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. ఆమె త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను... అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

ఆరు నెలగా టీబీతో, టీకి కూడా డబ్బుల్లేవే

ఆరు నెలగా టీబీతో, టీకి కూడా డబ్బుల్లేవే

తాను గత ఆరు నెలల నుండి టీబీ కారణంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నానని, గత 15 రోజులకి క్రితం ముంబైలోని ఆసుపత్రిలో చేరానని, తనకు సహాయం అందించాలని పూజా దద్వాల్ వేడుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత గోవాలో కొంతకాలం క్యాసినో మేనేజ్మెంట్ రన్ చేశానని, ప్రస్తుతం తన వద్ద వైద్యానికి కూడా డబ్బులు లేదని, టీ కోసం కూడా ఇతరులపై ఆధార పడాల్సి వస్తోందని పూజా ఇటీవల ఓ బాలీవుడ్ పత్రికకు వెల్లడించారు.

రవి కిషన్ సహాయం

రవి కిషన్ సహాయం

1997లో వచ్చి ‘తుమ్ సే ప్యార్ హో గయా' కలిసి పూజా దద్వాల్‌తో కలిసి వర్క్ చేసిన రవి కిషన్ ఆమె పరిస్థితి తెలిసి తన వంతు సహాయం అందించారు. తన మనుషులను ఆమె చికిత్స పొందుతున్న ముంబై ఆసుపత్రికి పంపి ఫ్రూట్స్, కొంత డబ్బు అందజేశారు. రవి కిషన్ అందించిన సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ అతడికి కృతజ్ఞతలు తెలియజేసింది పూజా.

English summary
Pooja Dadwal, who starred in Salman Khan’s 1995 film Veergati, has been suffering from Tuberculosis and other lung ailments. Salman Khan clarified that Pooja Dadwal was paired opposite his brother-in-law Atul Agnihotri and not him in the film. “I know… It’s really sad. She is not my co star… But she was Atul’s co-star,” said Salman. He further added, “I just heard about this and we are trying to help as much as we can. And our team is already into it. I was not knowing about this that she was going through this phase. Yeah, I think she will be okay.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X