Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రికెటర్ అజర్ మాజీ భార్యతో సల్మాన్.. బర్త్ డే పార్టీతో మళ్లీ చిగురించిన బంధం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రియురాళ్ల జాబితా భారీగానే ఉంటుంది. సంగీతా బిజ్లానీతో మొదలైన అఫైర్.. సోమీ అలీ, ఐశ్వర్యరాయ్ వరకు సాగింది. తాజాగా ఇలియా వాంటర్‌తో అఫైర్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ.. వాటిపై సల్మాన్ గానీ, వాంటర్ గానీ స్పందించలేదు. తాజాగా తన మాజీ ప్రేయసి, క్రికెటర్ అజహారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీతో కలిసి విందులో పాల్గొనడం, ఆ పార్టీలో తాజా ప్రేయసి వాంటర్ కూడా ఉండటం మరింత చర్చకు దారి తీసింది. సల్మాన్, సంగీత మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా? అనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్, సంగీతా లవ్ కహానీ
90వ దశకంలో సినిమాల్లోకి రాకముందు నుంచి సల్మాన్ ఖాన్, సంగీతా బిజ్లానీ కలిసి యాడ్స్ ఫిలింస్‌లో నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అఫైర్ ఉంది. సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత చాలా రోజులు డేటింగ్ చేశారు. ఎప్పుడైతే హీరోయిన్ సోమీ అలీకి దగ్గరయ్యారో అప్పటి నుంచి సల్మాన్‌కు సంగీతా దూరమైంది. అయితే ఆ తర్వాత చాలా రోజులు పలువురితో సంగీతాకు ఆఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
అజారుద్దీన్‌తో వివాహం
అయితే తనపై వస్తున్న అఫైర్ వార్తలకు భిన్నంగా అందరికీ షాకిస్తూ క్రికెటర్ అజారుద్దీన్‌ను 1996లో సంగీతా వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత చాలా రోజులు వారిద్దరు కలిసి కాపురం చేశారు. అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో అజర్, సంగీతాకు మధ్య విభేదాలు చోటుచేసుకోవడం, ఆ తర్వాత 2010లో పరస్పర అంగీకారంతో విడిపోవడం కూడా జరిగిపోయింది.
సంగీతాతో మళ్లీ సల్మాన్ ఖాన్
ఇక సోమి అలీతో సల్మాన్ ఖాన్ అఫైర్ సవ్యంగా సాగలేదు. సల్మాన్, సోమీ మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు రావడంతో వారిద్దరూ కూడా విడిపోయారు. అనంతరం ఐశ్వర్యరాయ్‌తో సల్మాన్ ప్రేమలో పడ్డారు. ఆ ఇద్దరి కథ కంచికి తెలిసిందే. మారిన పరిస్థితుల అనంతరం, అజర్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్, సంగీత మధ్య బంధం చిగురించింది. అప్పటి నుంచి స్నేహంగా ఇద్దరు కలిసి ఉంటున్నారు.
ఘనంగా సంగీత బర్త్ డే పార్టీ
తాజాగా సంగీత బర్త్ డే ఫంక్షన్‌కు సల్మాన్ ఖాన్ తన తాజా ప్రేయసి ఇలియా వాంటర్ హాజరయ్యారు. మళ్లీ సంగీతాతో సల్మాన్ చనువుగా ఉండటం అందరిని ఆకర్షించింది. వారి వెంట నిర్మాత సాజిద్ నడియావాలా, మెహనీష్ బెహల్ తదితరులు ఉన్నారు. ఈ పార్టీని గ్రాండ్‌గా సంగీతా నిర్వహించినట్టు తెలిసింది. ఇక సల్మాన్ విషయానికి వస్తే, దంబంగ్ 3 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 రంజాన్‌కు విడుదల కానున్నది.