twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరిచూపుకు నోచుకొని సల్మాన్.. అంత్యక్రియలకు దూరం.. వెంటాడిన విషాదం!

    |

    దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో మేనల్లుడి అబ్దుల్లా మరణం సల్మాన్ ఖాన్‌ను మరింత కలిచివేసింది. తనకు అత్యంత ఇష్టమైన అబ్దుల్లా ఆకస్మిక మృతితో సల్మాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారనే విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే కరోనా కారణంగా మరణించారనే రూమర్లపై సల్మాన్ మేనేజర్ వివరాలు అందించారు.

    గుండెపోటుతోనే మరణం

    గుండెపోటుతోనే మరణం

    సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా గుండెపోటుతోనే మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో హాస్పిటల్‌లో చేర్పించాం. అయితే కరోనావైరస్ కారణంగా చనిపోయారనే వార్తల్లో వాస్తవం లేదు. మరణానికి ముందు, ఆ తర్వాత నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి అని సల్మాన్ ఖాన్ మేనేజర్ జోర్డీ పటేల్ పేర్కొన్నారు.

     సల్మాన్ కోరిక మేరకు

    సల్మాన్ కోరిక మేరకు

    కొద్ది రోజుల క్రితం అబ్దుల్లా అస్వస్థతకు గురికావడంతో అంధేరిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించాం. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో సల్మాన్ కోరిక మేరకు బాంద్రాలోని మరో హాస్పిటల్‌కు తరలించాం. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు అని జోర్డీ పటేల్ తెలిపారు.

     ఇండోర్‌లో అంత్యక్రియలు

    ఇండోర్‌లో అంత్యక్రియలు

    అబ్దుల్లా ఆకస్మిక మరణంతో సల్మాన్ ఖాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లాక్‌డౌన్ కారణంగా అబ్దుల్లా స్వస్థలం ఇండోర్‌లో జరిగే అంత్యక్రియలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తనకు అత్యంత ఇష్టమైన మేనల్లుడి మరణంతో సల్మాన్ కుంగిపోయారు అని జోర్డీ పటేల్ వెల్లడించారు.

    Recommended Video

    Salman Khan Pledged 25,000 Daily Wage Workers
    మాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి

    మాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి

    అబ్దుల్లా మరణంపై సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం స్పందిస్తూ.. మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరణించడం మాకు చాలా బాధగా ఉంది. కనీసం ఓదార్పుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌కు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు అంటూ సలీం ఆవేదనకు లోనయ్యారు.

    English summary
    Salman Khan's nephew Abdullah Khan died in a Mumbai hospital. Salman took to social media to mourn the latter's death. Reportedly, the cause of Abdullah's death is heart-related illness.Salman Khan shared a picture of himself and Abdullah Khan on social media and wrote, "Will always love you... (sic).". Lackdown situation, Salman has not attended the funerals of Abdullah Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X