twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘Radhe’ మూవీతో సల్మాన్‌ను భారీ లాభాలు: కలెక్షన్లతో సంబంధం లేకుండానే అంత!

    |

    బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఈ సినిమాను రూపొందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం మే 13న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రతికూల రివ్యూలు వచ్చినప్పటికీ.. మొదటి రోజే దాదాపు 4.20 మిలియన్ క్లిక్కులు సాధించడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టేసింది. అదే కంటిన్యూ చేస్తూ మొదటి మూడు నాలుగు రోజులు ఈ మూవీ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

    రాధే చిత్రానికి దాదాపు రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్ అయిందట. అలాగే, అన్ని రైట్స్‌తో కలుపుకుని దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరుపుకుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత అయిన సల్మాన్ ఖాన్.. రూ. వంద కోట్లకు పైగానే లాభాలను అందుకున్నాడట. కలెక్షన్లతో కలుపుకుంటే ఆయన వంతుగా రూ. 150 కోట్ల వరకూ ప్రాఫిట్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఇదే స్పందన ఉంటే.. ఆయన లాభాలు రూ. 200 కోట్లు వరకూ చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Salman Khan Bags Huge Profit From Radhe Movie

    ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రాధే' సినిమాలో సల్మాన్ ఖాన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటించాడు. ముంబైలోని డ్రగ్స్ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఇది తెరకెక్కింది. ఈ సినిమాలో మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ర‌ణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని స‌ల్మాన్‌ ఖాన్‌, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.

    English summary
    Bollywood Star Hero Salman Khan Recent Film Radhe: Your Most Wanted Bhai. This film directed by Prabhu Deva. Salman Khan Bags Huge Profit From this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X