కాజోల్ మేనకోడలు కోసం సల్మాన్ పాట.. గాయకుడిగా మరోసారి
హ్యాంగోవర్, మై హూ హీరో తెరా సినిమాల్లో పాటలు పాడిన తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్ గాయకుడిగా మారారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న నోట్‌బుక్ చిత్రం కోసం తన గొంతు సవరించుకొన్నారు. ఈ చిత్రంలో మై తారే అంటూ సల్మాన్ పాడిన పాటకు విశేష స్పందన వస్తున్నది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
తాను పాడిన పాటను సల్మాన్ ఖాన్ పలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ట్రెండింగ్ మారింది. ఈ పాటను ప్రనుతన్, జహీర్ ఇక్బాల్‌పై చిత్రీకరించనున్నారు. వీరిద్దరూ కూడా నోట్ బుక్ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్‌తో కలిసి సల్మాన్ ఖాన్ నిర్మించారు.

హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ప్రానూతన్ ప్రముఖ హీరోయిన్లు నూతన్, తనూజా మనువారలు. అలాగే మైనే ప్యార్ కియా లాంటి చిత్రాల్లో నటించిన మొహనీష్ బెహల్ కూతురు. అంతేకాకుండా హీరోయిన్ కాజోల్ మేనకోడలు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











