మరోసారి బడా హీరో అనిపించుకున్నాడు.. సల్మాన్ క్రేజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలిగే ఈ బడా హీరో నేషనల్ వైడ్ గా తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. కమర్షియల్ యాంగిల్ లో పెట్టిన పెట్టుబడిని వారం గడవకముందే వెనక్కి తేగలడు.
షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వారు సల్మాన్ రేంజ్ లో ప్రతిసారి కలెక్షన్స్ అందుకోలేరు. సల్మాన్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ అందుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ స్టార్ హీరో తన క్రేజ్ ని మరీంత పెంచుకుంటున్నాడు. .ముఖ్యంగా ట్విట్టర్ లో ఈ స్టార్ హీరో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన రెండవ స్టార్ యాక్టర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు.

సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 40మిలియన్స్ దాటింది. మొన్నటివరకు మూడవ స్థానంలో కొనసాగిన సల్మాన్ మెల్లగా షారుక్ ఖాన్ (39.9M) ని దాటేశారు. మొదటి స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్ (41.5M) ని కూడా క్రాస్ చేసేందుకు సల్మాన్ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. లాక్ డౌన్ లోనే 40మిలియన్స్ ని ఈజీగా టచ్ చేసిన సల్మాన్ భాయ్ మరికొన్ని రోజుల్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నటుడిగా ట్విట్టర్ లో గుర్తింపు పొందుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ ఈ హీరో రాధే సినిమాతో రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











