సల్మాన్ ఖాన్ 'భారత్' టీజర్.. హృదయాన్ని హత్తుకునేలా ఎమోషనల్ డైలాగ్!
కండల వీరుడు సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు. 1940 సమయంలో దేశభక్తి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ డైలాగ్ తో ఈ చిత్ర టీజర్ విడుదుల చేశారు.
నటీనటులు ఎవరూ ఈ టీజర్ లో కనిపించరు. ఇండియా మ్యాప్ కనిపిస్తుండగా బ్యాగ్రౌండ్ నుంచి సల్మాన్ ఖాన్ వాయిస్ వినిపిస్తుంది. కొన్ని బంధాలు రక్తంతో ఏర్పడతాయి.. కొన్ని బంధాలు నెలతో ఏర్పడతాయి అని నాన్న చిన్నతనంలో చెప్పేవారు అంటూ సల్మాన్ ఖాన్ హృదయానికి హత్తుకునేలా డైలాన్గ్ చెప్పాడు.

భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముందుగా ప్రియాంక చోప్రాని హీరోయిన్ అనుకున్నారు. ప్రియాంక తప్పుకోవడంతో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. టబు, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2019 రంజాన్ కు ఈ చిత్రాన్ని విడుదుల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











