సల్మాన్ ఖాన్ బిగ్ బడ్జెట్ మూవీ.. బావగారి సంతోషం కోసమే!
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా దాని బడ్జెట్ మినిమమ్ 150కోట్లకు తక్కువ ఉండదు. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి వచ్చేలా మార్కెట్ కూడా సెట్ చేసుకున్నాడు. ఇటీవల కాలంలో సల్మాన్ చేసిన సినిమాలన్నీ కూడా ఎంతో కొంత లాభాన్ని అందించినవే.
అయితే సల్మాన్ ఎప్పటి నుంచో తన బావతో కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్న యువ హీరో ఆయుష్ శర్మ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయితే బావ ఆయుష్ కోసమైన ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేసి తన ద్వారా బ్రేక్ వచ్చేలా ప్లాన్ చేయాలని అనుకున్నాడు. ఇక మొత్తానికి అంతిమ్ సినిమాతో ఆ కోరిక నెరవేరబోతోంది.

సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ పాత్రలు ఈక్వల్ గా ఉండేలా దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారట. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయగా యూ ట్యూబ్ లో అది ట్రెండ్ అవుతోంది.
చూస్తుంటే ఆయుష్ కూడా చాలా పవర్ఫుల్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎంతవరకు హిట్టిస్తుందో చూడాలి. ఇక అంతిమ్ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ రాధే అనే సినిమాను కూడా ఫినిష్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











