Bigg Boss 16: 7 మంది ఫిక్స్.. ఈసారి హౌస్ లోకి బ్యూటీఫుల్ అమ్మాయిలు.. రొమాంటిక్ బాబులు!

ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటున్న హిందీ బిగ్ బాస్ షో తదుపరి సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. సల్మాన్ ఖాన్ మరోసారి అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ హోస్ట్ గా కనిపించబోతున్నారు. అయితే ఈసారి 16వ సీజన్లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఒక ఏడు మంది కంటెస్టెంట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అందులో ముఖ్యంగా శివిన్ నారంగ్ అనే టెలివిజన్ యాక్టర్ రాబోతున్నట్లు సమాచారం.

అతను గతంలోని బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతాను అని కూడా అన్నాడు. అతను వస్తే ఫిమేల్ ఫ్యాన్స్ నుంచి భారీ స్థాయిలో మద్దతు అయితే అందే అవకాశం ఉంది. ఇక మరొక టెలివిజన్ బ్యూటీ కనికా మన్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక లిస్టులో మరింత ఎక్కువగా వైరల్ అవుతున్న పేరులో జన్నత్ జుబేర్ పేరు కూడా ఉంది. సోషల్ మీడియాలో టెలివిజన్లో పలు రియాల్టీ షోల లో కూడా మెరిసిన ఈ చలాకీ పిల్ల దాదాపు ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.

Salman khan bigg boss 16th season top seven contestants names viral

ఇక మరొక బ్యూటిఫుల్ మోడల్ మదిరాక్షి ముండ్లే కూడా కూడా బిగ్బాస్ 16వ సీజన్లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఆమెకు డేరింగ్ అమ్మాయిగా కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ఈ బ్యూటీ వస్తే కుర్రాళ్ళు అట్రాక్ట్ అవ్వడం ఈజీ. అలాగే కాంట్రవర్సీలలో హైలెట్ అయినా కొంతమంది చిన్న స్థాయి సెలబ్రిటీలు కూడా 16 సీజన్ కి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో ప్రకృతి మిశ్రా పేరు కూడా బాగా వైరల్ అయింది.

ఈ బ్యూటీ ఎక్కువగా ఇతర యాక్ట్రెస్ పై పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి బాగా పాపులర్ అయింది. ఇక దిలిజిత్ కార్ మాజీ భర్త షాలిన్ బనోద్ కూడా బిగ్ బాస్ లోకి రావచ్చు అని తెలుస్తోంది. అతను గతంలోనే ఖత్రోన్ కె ఖిలాడి 12 లో పాల్గొన్నాడు. మరో బ్యూటిఫుల్ నటి టీనా దత్త కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 18 మందితో కూడిన బిగ్బాస్ ఇంటి సభ్యుల లిస్ట్ లో ఏడు మంది ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరి హౌస్ లోకి రాబోయే మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X