twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg boss 14: సల్మాన్ ఖాన్ కూడా స్టార్ట్ చేశాడు.. ఫామ్ హౌజ్ లోనే స్పెషల్ సెటప్!

    |

    తెలుగులో నాగార్జున బిగ్ బాస్ 4తో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా హిందీ బిగ్ బాస్ షోతో రెడీ అవుతున్నాడు. డైరెక్ట్ ప్రోమోతో వచ్చిన సల్మాన్ ఒక విధంగా ఆడియెన్స్ కి షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో తప్పితే ఈ సారి ఎక్కడా కూడా బిగ్ బాస్ షో హడావుడి కనిపించే అవకాశం లేదనే టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా కలర్స్ టీవీ ప్రోమోని వదిలి క్లారిటీ ఇచ్చేసింది.

    సల్మాన్ క్రేజ్ తోనే బిగ్ బాస్ కి భారీ డిమాండ్

    సల్మాన్ క్రేజ్ తోనే బిగ్ బాస్ కి భారీ డిమాండ్

    గత దశాబ్ద కాలంగా సల్మాన్ ఖాన్ కేవలం తన హోస్టింగ్ ద్వారానే బిగ్ బాస్ స్థాయిని పెంచుతున్నాడు. ఇతర స్టార్స్ మధ్యమధ్యలో హోస్టింగ్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. సల్మాన్ ఉంటేనే బిగ్ బాస్ కి అసలైన అర్థం అనేలా ఒక టాక్ క్రియేట్ అవ్వడంతో నిర్వాహకులు హోస్ట్ విషయంలో ఏ మాత్రం మార్పులు చేయడం లేదు.

    ప్రోమోతో షాకిచ్చిన నిర్వాహకులు

    ఇక ప్రస్తుతం కరోనా కష్ట కాలంలో 14వ సీజన్ స్టార్ట్ అవుతుందా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి కూడా సల్మాన్ ఖాన్ పూర్తిగా ఫామ్ హౌజ్ కె పతిమితం అయ్యాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమోను కూడా సల్మాన్ ఫార్మ్ హౌజ్ లోనే షూట్ చేశారు.

    ఫామ్ హౌజ్ నుంచే షూటింగ్

    ఫామ్ హౌజ్ నుంచే షూటింగ్

    నాలుగు నెలలుగా సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌజ్ లో వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ కోసం ముంబైకి రావాలని కోరగా ఫామ్ హౌజ్ నుంచే షూటింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాడట. ప్రోమోను అయితే అక్కడే షూట్ చేశారు. ఈ సారి హిందీ బిగ్ బాస్ హౌజ్ ను సిటీకి దూరంగానే ఏర్పాటు చేయనున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
    స్టార్ హీరోకు భారీ ఆదాయం

    స్టార్ హీరోకు భారీ ఆదాయం

    ఇక సల్మాన్ కి సంబంధించిన షూటింగ్ సెటప్ మాత్రం ఫామ్ హౌజ్ లోనే సెట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇక ఈ సారి బిగ్ బాస్ షోకి సల్మాన్ ఖాన్ కి 450కోట్లకు పైగా ఆదాయం అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షోను సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేయాలని కలర్స్ టీవీ ప్రణాలికలు రచిస్తోంది.

    English summary
    Salman Khan is someone who wants to cash in on the star image. Craze offers celebrity status in his own style and generates thousands of crores a year. Salman is giving salaries of less than a lakh to the workers he works with. The star hero seems to have a plan to increase his income once again with Bigg Boss, which is an integral part of the income
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X