లాక్ డౌన్ తరువాత అత్యదిక ధరకు అమ్ముడైన సినిమా ఇదే!

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి ఋజువయ్యింది. గత పదేళ్లుగా భాయ్ బాక్సాఫీస్ రికార్డుల జోరు ఏ మాత్రం మాత్రం తగ్గడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా వద్ద మినిమమ్ మూడు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇక ఈ సారి కరోనా కారణంగా పెద్ద సినిమాలకు కష్టాలు తప్పవని అనుకుంటున్నా తరుణంలో ఆ ప్రభావం ఏ మాత్రం ఉండదని సల్మాన్ నీరూపిస్తున్నారు.

సాధారణంగా సల్మాన్ ఖాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లో అభిమానులకు నచ్చే విదంగా సినిమాలు చేస్తుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ ఈ స్టార్ హీరో నుంచి రాధే అనే సినిమా రానుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సల్మాన్ సొంత ప్రొడక్షన్ లో రూపొందించారు. ప్రముఖ జీ స్టూడియోస్ ఇటీవల భారీ మొత్తం చెల్లించి సినిమా హక్కులను అందుకున్నట్లు తెలుస్తోంది.

Salman khan Biggest business deal after Lock down

ఒక విధంగా లాక్ డౌన్ తరువాత ఇదే అత్యదిక బిజినెస్ డీల్ అని చెప్పవచ్చు. సినిమాకు సంబంధించిన నార్త్ డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, డిజిటల్ హక్కులన్ని మాట్లాడుకొని రూ.230కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఈ డీల్ తో సినిమాను జీ సంస్థ ఇష్టమున్నపుడు రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే ఓటీటీలో కూడా ఎప్పుడూ రిలీజ్ చేయాలి, అలాగే టీవీ ప్రీమియర్స్ ఎప్పుడు పడాలనే నిర్ణయం కూడా వారి చేతుల్లోనే ఉంటుందట. ఇక మే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకి రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X