Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ : స్టార్ హీరోను కరిచిన పాము.. అర్ధరాత్రి సమయంలో ఫాం హౌస్ లో ఘటన!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అయితే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు చేదువార్త. పాము కాటుకు గురైన సల్మాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. మీడియా కథనాల ప్రకారం, సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్ హౌస్‌లో పాము కాటుకు గురయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే

బిగ్ బాస్ షోలో కూడా రాజమౌళి
సల్మాన్ ఖాన్ ప్రస్తుత్తం RRR సినిమా హిందీ ప్రమోషన్స్ బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తెలుగు మలయాళం కన్నడ భాషలతో పాటుగా మరో ఐదు విదేశీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

బిగ్ బాస్ షోలో రాజమౌళి
మాస్టర్ మైండ్ జక్కన్న సినిమా కావడంతో ప్రమోషన్స్ లో కూడా ఆసక్తి రేపుతూ చేసుకుంటూ వెళుతున్నారు. దర్శకుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలను తీసుకుని బాలీవుడ్ లో ప్రమోషన్స్ వీర లెవల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఎక్కువ టీవీ కంటెంట్ తోనే సినిమాను జనానికి చేరువయ్యేలా చేస్తున్నారు. అందుకే ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా రాజమౌళి హీరోలతో కలిసి పాల్గొన్నారు.

హీరోగా
రాజమౌళి తన ఇద్దరు హీరోలతో కలిసి హిందీ బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్‌తో ఎక్కువ సమయం గడిపారు. చరణ్, తారక్ మరియు అలియా భట్‌లతో పాటు, RRR దర్శకుడు సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చి బిగ్ బాస్ 15 వేదికపై సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసి అబ్బురా పరిచారు. రాజమౌళి దర్శకుడు కాగా అలియా భట్ కెమెరామెన్. ఇక తారక్-చరణ్ విలన్లుగా సల్మాన్ ను హీరోగా చిన్న బిట్ చేసారు. అయితే ఇదిలా ఉంటె తాజాగా సల్మాన్ ఖాన్ ను పాము కరిచింది.

పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌కి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల కోసం పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సల్మాన్ తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం రేపు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకల కోసం పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు.

ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది
అయితే అదే ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌ను పాము కాటు వేసింది. నిన్న రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కమోతే సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కోసం హుటాహుటిన ఆయనని తరలించారు. ఇక ఈ చికిత్స అనంతరం సల్మాన్ ఇంటికి చేరుకున్నాడని అంటున్నారు. ఈ పాము విషపూరితం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అయితే సల్మాన్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చాడని కూడా పలు కధనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.