3000 వేల కోట్లతో రిచ్చెస్ట్ హీరోగా అన్న .. అద్దె డబ్బుతో బతుకుతోన్న తమ్ముడు, ఎవరంటే?

ఒకే తల్లికి పుట్టిన బిడ్డల మనస్తత్వాలు వేరుగా ఉన్నట్లే , వారి జీవితాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అన్న సంపన్నుడిగా ఉంటే తమ్ముడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్న సామాన్యులే కాదు.. ప్రముఖుల జీవితాలు చూసినా ఇలాంటి వారెందరో ఉంటారు. తాజాగా వేల కోట్ల సంపదతో ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోలలో ఒకరిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అద్దె డబ్బుతో బతుకుతున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Salman Khan Brother Sohail Khan to earn huge amount in rent form Bandra property

తండ్రి స్టార్ రైటర్ అయినా సల్మాన్‌కు కష్టాలే

దాదాపు 3 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా ఉన్నారు సల్మాన్ ఖాన్. 1965 డిసెంబర్ 27న బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీంఖాన్- సుశీల చారక్ దంపతులకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు సల్మాన్ ఖాన్. ఆయన పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. తండ్రి బాలీవుడ్‌లో స్టార్ రైటర్ అయినా సినిమా ఛాన్సుల కోసం సల్మాన్ ఎంతో కష్టపడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్‌స్టార్‌గా నిలిచారు.

ఖాన్ త్రయంలో ఒకరిగా

1988లో ఫలాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన సల్మాన్ ఖాన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు. మైనే ప్యార్ కియా, సనమ్ బేవాఫా, సాజన్ చిత్రాలు హిట్ కావడంతో బాలీవుడ్‌లో సల్మాన్ శకం మొదలైంది. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలతో హోరెత్తించారు. సల్మాన్ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకుంటున్న దశలో వాంటెడ్, రెడీ, దబాంగ్ , బజరంగీ భాయిజాన్ తదితర చిత్రాలతో రఫ్పాడించారు సల్మాన్. ఇటీవల సికిందర్‌తో ప్రేక్షకులను పలకరించిన ఆయన మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నారు.

సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ 3000 కోట్ల పైనే

ఇన్నేళ్ల కెరీర్‌లో వేల కోట్ల ఆస్తులను సంపాదించారు సల్మాన్ . సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ఆయనకు దేశ విదేశాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ ప్యాలెస్‌లు, ఫాంహౌస్‌లు ఉన్నాయి. అర్పిత ఫామ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిట్‌నెస్ సెంటర్లు ఉన్నాయి. పలు వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా ఏడాదికి వందల కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు సల్మాన్ ఖాన్. ఆయన నికర సంపద విలువ రూ.3000 కోట్ల పైమాటేనని బాలీవుడ్ టాక్. అలాంటి స్టార్ హీరో తమ్ముడు సొహైల్ ఖాన్ అద్దె డబ్బులతో జీవిస్తున్నాడట.

60 నెలల పాటు ప్రాపర్టీ లీజు

సొహైల్ ఖాన్‌కు ముంబై బాంద్రా ఏరియాలో అత్యంత ఖరీదైన కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. దీనిని ఇటీవల ఓ ఐరీష్ కంపెనీకి 60 నెలల పాటు అద్దెకు ఇచ్చారట. గ్యాస్పర్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఈ ప్రాపర్టీ విస్తీర్ణం దాదాపు 1290 చదరపు అడుగులు ఉంటుందట. లీజు సమయంలో 60 లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్నారు సొహైల్. ఈ అద్దె ఒప్పందానికి 2.67 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ , 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

60 నెలలకు 10 కోట్లపైనే ఆదాయం

ఈ ఒప్పందం కింద మొదటి మూడేళ్లలో నెలకు రూ.16.89 లక్షలు.. ఆ తర్వాత రెండేళ్ల పాటు నెలకు రూ.17.73 లక్షలు చెల్లించాలి. మొత్తంగా ఈ 60 నెలలకు గాను సొహైల్ ఖాన్ ఈ అద్దె ఒప్పందం ద్వారా రూ.10 కోట్లకు పైనే ఆదాయాన్ని అందుకోనున్నారు. సో.. అదన్న మాట మేటర్. సొహైల్ ఖాన్ ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ - విజయశాంతిల చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X