సూపర్ స్టార్ సోదరుడికి విడాకులు.. మాజీ ప్రియుడితో ముద్దుగుమ్మ డేటింగ్!
సినిమా పరిశ్రమలో అఫైర్లు, డేటింగ్, విడాకులు తీసుకోవడం లాంటి వార్తలు తరచుగానే వినిపిస్తుంటాయి. కాకపోతే హిందీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో సోదరుడు, నటుడు, దర్వకుడితో డైవోర్స్ తీసుకొన్న తర్వాత మళ్లీ తన మాజీ ప్రియుడితో డేటింగ్ చేస్తున్న నటి వార్త అందరిని ఆకట్టుకొన్నది. అయితే ఆ స్టార్ హీరో తమ్ముడు ఎవరు? విడాకుల తర్వాత ఆయన భార్య ఎవరితో డేటింగ్ చేస్తున్నది? అనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సీమా సజ్‌దే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమలో డిజైనర్‌గా రాణిస్తున్న సమయంలో బిజినెస్ మ్యాన్, బాబీ డియోల్ బావమరిది విక్రమ్ అహుజాతో నిశ్చితార్థం చేసుకొన్నది. ఆ తర్వాత ఆయనతో నిశ్చితార్థం తర్వాత సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, దర్శకుడు సోహైల్ ఖాన్‌తో కలిసి పారిపోయి వివాహం చేసుకొన్నది. అప్పట్లో ఈ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది.

అయితే సోహైల్ ఖాన్‌తో 1998 సంవత్సరంలో సీమా సజ్‌దే వివాహం చేసుకొన్నారు. వారిద్దరికి నిర్వాన్ ఖాన్, యోహన్ ఖాన్ సంతానం ఉన్నారు. దాదాపు వారిద్దరి వైవాహిక జీవితం 24 సంవత్సరాలపాటు కొనసాగింది. అయితే అభిప్రాయ విభేదాలు తలెత్తడంతో వేర్వేరుగా జీవించారు. ఆ తర్వాత 2022 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. కానీ కొన్నేళ్లపాలు తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ఇద్దరు కలిసి తీసుకొన్నారు.
బాలీవుడ్‌లో పాపులర్ టాక్ షో ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ (Fabulous Lives vs Bollywood Wives) లో సీమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం, ప్రస్తుతం లవ్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడు విక్రమ్ అహుజాతో తిరిగి లవ్ అఫైర్ కొనసాగించడం, డేటింగ్ వ్యవహారాన్ని వివరించారు.
టాక్ షోలో సీమా మాట్లాడుతూ.. విడాకుల విషయంలో నాపై రకరకాల నెగిటివిటీ పేరుకుపోయింది. అలాంటి దానిని తొలగించుకొనేందుకు నేను నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది. నా పిల్లలు, ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కాకూడదు. అందుకే నేను నిజాలు చెప్పాలనుకొంటున్నాను. నేను ఎవరేమనుకొన్నా పట్టించుకొనే స్థితిలో ఉన్నాను. కాబట్టే నేను జీరో ఫిల్టర్స్‌తో మాట్లాడుతున్నాను అని చెప్పారు.
ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్ (Fabulous Lives vs Bollywood Wives) విషయానికి వస్తే.. ఈ టాక్ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్నది. తాజా సీజన్ అక్టోబర్ 18 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ షోలోకి రణ్‌బీర్ కపూర్ సోదరి రిద్దిమా కపూర్, కల్యాణి సాహా చావ్లా, షాలిని పస్పీ అనే ప్రముఖులను పరిచయం చేశారు.


Click it and Unblock the Notifications











